ప్రతి ఒక్కరు అమెరికా నుంచే లబ్ది పొందేందుకు చూస్తున్నారని, రాబరీ చేయడానికి తాము బ్యాంకులము కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికా దిగుమతి వస్తువులపై 100 నుంచి 50 శాతానికి సుంకం తగ్గించడంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తన హయాంలో అమెరికా మోసపోదని సోమవారం సీబీఎస్‌కు ట్రంప్ ఇంటర్వ్యూ ఇచ్చారు.‘‘భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాకు మంచి మిత్రుడు. కానీ వారేం చేశారో చూడండి. అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న హార్లే డేవిడ్‌సన్ వాహనాలపై 100 శాతం సుంకం విధించారు. అయితే వాటిపై 50 శాతం సుంకం తగ్గించారు. కాని అది కూడా ఆమోదయోగ్యం కాదు. అదే మేము వారి వస్తువులపై ఎలాంటి సుంకాలు వసూలు చేయడం లేదు. కాబట్టి భారత్ ఈ సుంకాలను సున్నాకు తగ్గించాలి’’ అని ట్రంప్ అన్నారు.‘‘అమెరికా బ్యాంకు కాదు. ప్రతి ఒక్కరు అమెరికాను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గత కొన్నేళ్లుగా అమెరికా వాణిజ్య లోటు 800 బిలియన్ డాలర్లకు చేరింది. అందరూ అమెరికా నుంచి లబ్ది పొందాలనే చూస్తున్నారు’’ అని సీబీఎస్‌కు ఇంటర్వ్యూలో ట్రంప్ అన్నారు.
అందరూ అమెరికాని….
Related tags :