తెలుగు కవి, సాహితీవేత్త సినారె (సింగిరెడ్డి నారాయణరెడ్డి) పార్లమెంట్ ప్రసంగాలపై రూపొందించిన పుస్తకాన్ని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. పెద్దల సభలో తెలుగు పెద్ద పుస్తకావిష్కరణ సభ మంగళవారం తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్, నేషనల్ జ్యూడిషియల్ అకాడమీ డైరెక్టర్ జస్టిస్ గోడ రఘురామ్, తదితరులు పాల్గొన్నారు. మాజీ రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రచించిన ‘పెద్దల సభలో తెలుగు పెద్ద’ పుస్తకాన్ని తన చేతుల మీదుగా ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. సినారే మాటలు, కవితలు గురించి తాను చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు పేరుపేరున కృతజ్ఞతలు తెలపుతున్నానన్నారు. ఇక సినారె 1997 రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అయ్యారు. ఆరేళ్ళపాటు సభలో ఆయన ప్రశ్నలు, ప్రసంగాలు, చర్చలు, ప్రస్తావనలు అందరి మన్ననలనూ అందుకున్నాయి.
“పెద్దల సభలో తెలుగు పెద్ద” పుస్తకావిష్కరణ
Related tags :