భారత వన్డే క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాడిగా గుర్తింపు పొందిన యువరాజ్ సింగ్ సోమవారం ఆటకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అతని రిటైర్మెంట్‌పై స్పందిస్తూ టీమిండియా ఆటగాళ్లు, మాజీ క్రికెటర్లు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. యువీతో గడిపిన సందర్భాలను నెమరువేసుకుంటూ.. అతని అద్భుత ఇన్నింగ్స్‌లను కొనియాడుతున్నారు. ఇదే క్రమంలో గతంలో యువీ ప్రియురాలంటూ ప్రచారం జరిగిన నటి కిమ్‌శర్మ అతని రిటైర్మెంట్‌పై స్పందించారు. భారత క్రికెట్‌కు యువీ చేసిన సేవలను కొనియాడుతూ ట్వీట్ చేశారు. ‘యువీ అద్భుతంగా ఆడావు. నీ ఆట, రికార్డులు మరవలేనివి. హేజల్ కీచ్‌తో నీ మిగతా జీవితం కూడా ఇలానే విజయవంతం కావాలని కోరుకుంటున్నా’ అని యువీని అభినందించారు.
యువరాజ్‌కు కిమ్ కోరికలు
Related tags :