DailyDose

మూడు కొత్త వాహనాలు విడుదల-వాణిజ్య-06/12

Honda India Releases Three Brand New Models - June 12 2019 - Business News

*హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ టూవీలర్‌ను లాంచ్‌ చేసింది. ‘నిశ్శబ్ద విప్లవం’లో భాగంగా బీఎస్‌-6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా తన మొట్టమొదటి స్కూటర్‌ను భారత మార్కెట్లో లాంచ్‌ చేసింది. సరికొత్త డిజైన్‌, ఇంజీన్‌ అప్‌డేట్స్‌తో న్యూ జనరేషన్‌ యాక్టివాను తీసుకొచ్చింది. ముఖ్యంగా నాయిస్‌ లెస్‌ స్టార్టర్‌ మోటార్‌, ఇన్‌స్ట్రుమెంటల్‌ను క్లస్టర్‌ కొత్త యాక్టివా 125 ఎఫ్‌ 1 స్కూటర్‌లో సరికొత్త ఫీచర్లుగా ఉన్నాయి. 125 సీసీ ఇంజీన్‌, డిస్క్‌బ్రేక్‌ తదితర ఫీచర్లతో లాంచ్‌ చేసింది. ఇంకా స్టాండ్‌ ఇండికేటర్‌ను కూడా జోడించింది. స్టాండ్‌ వేసి వుంటే ఇంజీన్‌స్టార్‌ కాదు అన్నమాట. అలాగే 6 ఏళ్ల వారంటీని కూడా అందిస్తోంది.ఈ ఏడాది సెప్టెంబర్‌ నుంచి కొనుగోళ్లకు అందుబాటులో ఉంటుంది.
*ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లో మెజారిటీ వాటాను అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ బ్లాక్‌స్టోన్‌ కొనుగోలు చేసింది.
*టాటా మోటార్స్‌ కు చెందిన జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) అంతర్జాతీయ అమ్మకాలు మేలో 12.2% తగ్గి 42,370 వాహనాలుగా నమోదయ్యాయి.
*రుణ పత్రాలపై రూ.962 కోట్ల వడ్డీ చెల్లించినట్లు దేవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ (డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) వెల్లడించింది.
*టాటా పవర్‌ సోలార్‌ సంస్థ తన సౌర ఉత్పత్తులను రాష్ట్రంలో ప్రారంభించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 18 నగరాల్లో తన సేవలను అందిస్తున్న సంస్థ 19వ నగరంగా ఆధ్యాత్మిక నగరి తిరుపతిని ఎంచుకుంది. భవిష్యత్తు అవసరాలు, పర్యావరణహితమైన విద్యుత్తును ప్రోత్సహించే క్రమంలో తిరుపతి ఐఐటీ క్యాంపస్‌లో డీన్‌ ఎన్‌.కిశోర్‌ చేతుల మీదుగా టాటా పవర్‌ సోలార్‌ తన కొత్త వెంచర్‌ను ప్రారంభించింది.
*జీఎస్‌టీ కొత్త రిటర్న్‌ల విధానం అక్టోబరు నుంచి ప్రారంభమవుతుందని ఆర్థిక శాఖ వెల్లడించింది. వాస్తవానికి జులై నుంచే దీనిని ప్రారంభించాలని ఆర్థిక శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
*వేసవి కాలం సందర్భంగా ఇండిగో ప్రత్యేక విక్రయాలను ప్రకటించింది. జూన్‌ 16 నుంచి సెప్టెంబరు 28 మధ్య కాలంలో ప్రయాణించే వారి కోసం నాలుగు రోజుల ప్రత్యేక అమ్మకాలను ప్రవేశపెట్టింది.
*జర్మనీకి చెందిన తైసన్‌క్రప్‌ భారత్‌కు చెందిన టాటా స్టీల్‌తో విలీనం కావడానికి ఐరోపో సమాఖ్య(ఈయూ) మోకాలడ్డుతోంది.
*భారత ఆర్థిక వృద్ధి రేటును 2011-12 నుంచి 2016-17 మధ్య 2.5 శాతం ఎక్కువగా అంచనా వేశారని మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌ పేర్కొన్నారు.