‘ఒరు అడార్ లవ్’ సినిమాతో మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు మలయాళీ భామ ప్రియా ప్రకాశ్ వారియర్. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టేశారు. అయితే ఆమె నటిగా కంటే చదువుకుంటేనే బాగుంటుందని తన టీచర్లు అభిప్రాయపడుతున్నారట. ఈ విషయాన్ని ప్రియ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘చదువును మధ్యలోనే ఆపాలని నా తల్లిదండ్రులు ఎప్పుడూ చెప్పలేదు. అలా చేయడం వారికి ఇష్టం లేదు. మరో ఏడాది లో డిగ్రీ పట్టా అందుకుంటాను. అప్పుడు పూర్తిగా సినిమాలపై దృష్టిసారించవచ్చు. నాకు చదువు చెప్పిన టీచర్ల అభిప్రాయం ఏంటంటే.. నేను నటన కంటే చదువులోనే చురుకుగా ఉంటానని అంటున్నారు. నటన ఆపేసి చదువుపై దృష్టిసారించాలని చెబుతున్నారు. అది వారికి నాపై ఉన్న అభిమానం. కానీ నాకు నటన అంటేనే ఇష్టం. నేనేమీ ఫస్ట్‌క్లాస్ స్టూడెంట్‌ని కాను. కాలేజ్‌కి వెళుతున్నందుకు గ్రేస్ మార్కులు కూడా పడవు’ అని తెలిపారు.
చదువుకోమని చంపుతున్నారు
Related tags :