తెలంగాణ కెనడా సంఘం ఆధ్వర్యంలో గ్రేటర్ టొరొంటోలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మిస్సిసౌగాలోని గ్లెన్ ఫారెస్ట్ పాఠశాల ఆడిటోరియంలో జరిగిన ఈ వేడుకలకు 600 మందికి పైగా ప్రవాస తెలంగాణా వాసులు హాజరయ్యారు. ఈ ఉత్సవాలు తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు రమేశ్ మునుకుంట్ల ఆధ్వర్యంలో జరిగాయి. కవిత తిరుమలాపురం, రజని మాధి, విధాత, విశాల, సంధ్య కుంచంలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రమేశ్ మునుకుంట్ల తెలంగాణ ఉద్యమంలో ఆశువులు బాసిన అమరులకు శ్రద్దాంజలి ఘటిస్తూ సభికులందరితో మౌనం పాటింపచేశారు. తెలంగాణ కెనడా అసోసియేషన్ ట్రుస్టీ బోర్డు అధ్యక్షులు హరి రావుల్, ఉపాధ్యక్షులు విజయకుమార్ తిరుమలాపురం, కార్యదర్షి శ్రీనివాస్ మన్నెం, కోషాధికారి దామోదర్ రెడ్డి మాది, సాంస్కృతిక కార్యదర్షి దీప గజవాడ, డైరెక్టర్లు మనోహర్ భొగా, శ్రీనివాస్ చంద్ర, మంగ వాసం, మూర్తి కలగోని, గణేశ్ తెరాల, ట్రస్టీలు సురేశ్ కైరోజు, వేనుగోపాల్ రెడ్డి ఏళ్ల , నవీన్ ఆకుల, ఫౌండర్లు కోటేశ్వరరావు చిత్తలూరి, చంద్ర స్వర్గం, దేవేందర్ రెడ్డి గుజ్జుల, రాజేశ్వర్ ఈద, అథీక్ పాష, ప్రభాకర్ కంబాలపల్లి, కలీముద్దిన్ మొహమ్మద్, అఖిలేశ్ బెజ్జంకి, సంతోష్ గజవాడ, నవీన్ సూదిరెడ్డి, ప్రకాశ్ రెడ్డి చిట్యాలలు ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో తమవంతు కృషి చేశారు. సాంస్కృతిక కార్యదర్షి దీప గజవాడ, ఉపాధ్యక్షులు విజయకుమార్ తిరుమలాపురం ఆధ్వర్యంలో మూడు గంటలపాటు చక్కటి దూంధాం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ఉత్సవాలలో తెలంగాణ ఫుడ్ కమీషన్ అధ్యక్షులు తిరుమల్ రెడ్డి కొమ్ముల ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ ఉత్సవాలలో తెలంగాణ కెనడా సంఘం అత్యంత రుచికరమైన భోజనాలను ఏర్పాటు చేసింది. చివరగా ఉపాధ్యక్షులు విజయకుమార్ తిరుమలాపురం వందన సమర్పణతో ఉత్సవాలు ముగిశాయి.
తెలంగాణ కెనడా సంఘం ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలు
Related tags :