**శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఉద్యోగం చేస్తున్న ఓ యువతి అదృశ్యం మిస్టరీగా మారింది. ఇంటి నుంచి బయటకు వెళ్లి వారం రోజులైనా ఆచూకి తెలియలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు శంషాబాద్ ఎయిర్‌పోర్టు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. నల్గొండ జిల్లా కోదాడకు చెందిన 28 ఏళ్ల రాజ్యలక్ష్మి రెండేళ్లుగా విమానాశ్రయంలో తాత్కాలిక ఉద్యోగం చేస్తోంది. అవివాహితైన రాజ్యలక్ష్మి RB నగర్‌కాలనీలో అద్దెగదిలో నివసిస్తోంది. ఈ నెల 7న ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఆమె ఇప్పటి వరకు ఆచూకీలేదు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు శంషాబాద్ పోలీసులు.
*ఓ వ్యక్తిని దారుణంగా హత్యచేసి మృతదేహాన్ని రైలుపట్టాలపై పడేశారు. ఈ ఘటన డోన్ పట్టణ పరిధిలో గురువారం వేకువజామున చోటుచేసుకొంది.
*మహరాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. ప్రియురాలిపై అనుమానంతో ఓ ఐటీ ఉద్యోగి ఆమెను పాశవికంగా హతమార్చాడు. పుణెలోని చందానగర్‌లో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
*సంగారెడ్డి జిల్లాలో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని, ఇద్దరు విద్యార్థినులు కనిపించకుండా పోయారు. వీరిలో పటాన్‌చెరుకు చెందిన ఇద్దరు ఇంటర్ విద్యార్థినులు కాగా..మరో యువతి సాఫ్ట్ వేర్ ఉద్యోగిని. పటాన్‌చెరుకు చెందిన ప్రశాంతి, గాయత్రి స్థానిక ఇంటర్ జూనియర్ కళాశాలలో చదువుతున్నారు. మంగళవారం ఉదయం ఇద్దరూ కాలేజీకి వెళ్తున్నామని చెప్పి మళ్లీ తిరిగి ఇంటికి రాలేదని వారి తల్లిదండ్రులు తెలిపారు. ఇద్దరు స్నేహితులు ఎక్కడికి వెళ్లారో తెలియక తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో వారు పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
*శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఉద్యోగం చేస్తున్న ఓ యువతి అదృశ్యం మిస్టరీ మారింది. ఇంటి నుంచి బయటకు వెళ్లి వారం రోజులైనా ఆచూకి తెలియలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు శంషాబాద్ ఎయిర్ పోర్టు పీ ఎస్ లో ఫిర్యాదు చేసారు. నల్గొండ జిల్లా కోదాడకు చెందిన 28 ఏళ్ల రాజ్యలక్ష్మి ఆర్బీ నగర్ కాలనీలో అద్దెగదిలో నివసిస్తోంది. ఈనెల ఏడున ఇంటి నుంచి బయటకి వెళ్ళిన ఆమె ఇప్పటి వరకు ఆచూకిలేదు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నారు శంషాబాద్ పోలీసులు.
*పోలీసు కావాలని కలలు కన్న ఓ చిన్నారి కుటుంబాన్ని.. మృత్యువు స్కూల్ ఫీజు రూపంలో కబలించింది. తమిళనాడులోని నాగపట్టణం జిల్లా వెలిపాలేనికి చెందిన గోల్డ్ స్మిత్ సెంథిల్ కుమార్(35) తన పదకొండేళ్ల కొడుకును ప్రైవేటు స్కూళ్లో చదివించి ప్రయోజకుడ్ని చేయాలనుకున్నాడు. కానీ, స్కూలు ఫీజు కట్టలేని పరిస్థితిలో మనస్తాపానికి గురై కుమారుడు, భార్యతో పాటు, సెంథిల్ కుమార్ బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
*అభం శుభం తెలియని ఇద్దరు మైనర్లపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అమానుష సంఘటన ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్ జిల్లాలోని కశీర్వా గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
*విజయవాడ సమీపంలో పిడుగుపాటుకి వ్యక్తి మృతి.. సమీపంలో ఇల్లు ఉండటంతో చల్లటి గాలి వీస్తుందనిచెట్టు కింద బల్లపై కూర్చున్న యువకుడిపై పడిన పిడుగుచెట్టుపై హైటెన్షన్ విద్యుత్ వైర్లు ఉండటంతో పక్కన ఉన్న ఎలక్ట్రిక్ మీటర్ కూడా ధ్వంసం.
*తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు శ్రీకాకుళం జిల్లా వాసులు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా ఎన్నికవుతున్న తమ్మినేని సీతారామ్‌కు అభినందనలు తెలిపేందుకు శ్రీకాకుళం జిల్లా నుంచి రెండు బస్సులు, ఆరు కార్లలో వై
*కడప జిల్లాలోని వేముల మండలంలో దారుణ హత్య జరిగింది. గొల్లలగూడూర్ గ్రామంలోని సిగం మనోహర్ రెడ్డి (35) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గురువారం తెల్లవారుజామున ఇంటిబయట నిద్రిస్తుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపారు. దీంతో మనోహర్ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానిక సమాచారం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
* ప్రేమజంటపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన గడిచిన రాత్రి నగరంలోని నెక్లస్‌రోడ్‌లో చోటుచేసుకుంది. ప్రేమికురాలితో కలిసున్న యువకుడిపై కొందరు యువకులు సామూహిక దాడి చేశారు. ఈ దాడిలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
*యశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. స్థానిక అంబేద్కర్ సెంటర్‌లో నాగరబోయిన కనకరాజు(50) అనే వ్యక్తి టీ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. కాగా ఓ లాడ్జ్ సమీపంలో కనకరాజు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. గుర్తుతెలియని దుండగులు దారుణంగా కొట్టి హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
*పదిహేనేళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపుతోంది. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధి రాజీవ్‌గాంధీనగర్‌లో మైనర్ బాలిక కాళ్లుచేతులు కట్టేసి ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
*శాసనసభ స్పీకర్‌గా ఎన్నికైన తమ్మినేని సీతారాం నేడుప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైసీపీ నేతలుతమ్మినేని అభిమానులుఅనుచరులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాగా తూర్పుగోదావరి జిల్లా నుంచి విజయవాడకు వైసీపీ నేతలు వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం తుని సమీపంలో వైసీపీ నేతలు వస్తున్న కారు ఇద్దర్ని ఢీ కొన్నది. ఈ ఘటనలో పప్పల నారాయణమూర్తి (69),బాడన లక్ష్మణ్ నాయుడు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో పొందూరు మండలానికి చెందిన మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఒకరు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
*వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమైన మరుసటి రోజునే ఓ విద్యార్థిని పాఠశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకొన్న ఘటన గురువారం చోటుచేసుకుంది.
* తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు శ్రీకాకుళం జిల్లా వాసులు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా ఎన్నికవుతున్న తమ్మినేని సీతారామ్‌కు అభినందనలు తెలిపేందుకు శ్రీకాకుళం జిల్లా నుంచి రెండు బస్సులు, ఆరు కార్లలో వైకాపా నేతలు, అభిమానులు బుధవారం అర్ధరాత్రి అమరావతికి బయలుదేరారు. ఈ తెల్లవారుజామున తుని పోలీస్ స్టేషన్ సమీపంలోకి రాగానే వైకాపా నేతలు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం రోడ్డు పక్కన ఆగివున్న లారీని ఢీకొట్టింది.
*రూ.లక్షల్లో రుణాలు మంజూరు చేస్తామని నమ్మించి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో రూ.కోట్లలో నగదు వసూలు చేసి మోసం చేసిన ఓ ప్రైవేటు సంస్థ నిర్వాహకుడిని బాపట్ల పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
*‘టిక్ టాక్’ యాప్ వినియోగించవద్దని భర్త మందలించడంతో మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడిన భార్య ఉదంతమిది. తన ఆత్మహత్య ప్రయత్నాన్నీ ఆ మహిళ టిక్‌టాక్‌లో పెట్టడం సంచలనంగా మారింది.
*చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలో బుధవారం ఉదయం కిక్కిరిసి ప్రయాణిస్తున్న ఆటోను, ఎదురుగా వచ్చిన వ్యాను ఢీకొనడంతో నలుగురు దుర్మరణం చెందారు.
*భారీ వాహనం అతివేగం అనర్థాన్ని తెచ్చిపెట్టింది. శుభకార్యానికి వెళ్లివస్తున్న ఇద్దరు అభాగ్యులను కబళించింది. ఇనుప ఖనిజం లోడుతో వెళ్తున్న భారీ లారీ టైర్లు పేలి, అదుపు తప్పి పక్కనున్న ద్విచక్రవాహనంపై పడటంతో దానిపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. లారీ డ్రైవర్, క్లీనర్ సైతం మృత్యువాత పడ్డారు. దుర్ఘటన అనంతపురం జిల్లా నార్పల మండలం మద్దలపల్లి వద్ద బుధవారం జరిగింది.
*ఏడాదిన్నర క్రితం తాను కొనుగోలు చేసిన వ్యవసాయ భూమికి పట్టాదారు పాసుపుస్తకం అందజేయడంలో రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తోందని ఆవేదన చెందుతూ బుధవారం ఓ యువరైతు తహసీల్దారు కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు యత్నించారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వింజపల్లికి చెందిన పలువురు రైతులకు చెందిన భూ వివరాలు దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమంలో గల్లంతయ్యాయి.
*విశాఖ-తూర్పు గోదావరి జిల్లా సరిహద్దుల్లో బుధవారం తెల్లవారుజామున మావోయిస్టులు, పోలీసుల మధ్య భారీ ఎదురుకాల్పులు జరిగాయి.
*నిబంధనలకు విరుద్ధంగా రుణాలు మంజూరు చేసి మళ్లీ వాటిని తన ఖాతాలో వేసుకున్న ఎస్‌బీఐ అసిస్టెంట్ మేనేజర్ కటారి ఇమాన్యుయేల్‌తోపాటు అతనికి సహకరించిన వారిపై హైదరాబాద్ సీబీఐ విభాగం కేసు నమోదు చేసింది.
*నకిలీ పత్తి విత్తనాల తయారీ, సరఫరా ముఠా గుట్టును విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రట్టు చేశారు. ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకొని పెద్దమొత్తంలో విత్తన బస్తాలను స్వాధీనం చేసుకున్నారు.
*రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన పెరుమాళ్ల ప్రణయ్ హత్యకేసుకు సంబంధించిన అభియోగపత్రాలను బుధవారం నల్గొండ కోర్టులో సమర్పించారు.
*దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో ఉగ్రవాదుల దాడిలో అయిదుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
*రాజధాని నగరంలో గుట్టుగా చేతులు మారుతున్న రూ.1.01 కోట్ల హవాలా సొమ్మును హైదరాబాద్ మధ్య మండలం టాస్క్‌ఫోర్స్ అధికారులు బుధవారం రాత్రి పట్టుకున్నారు.
*మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు మండలం గుర్రూరు గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. గ్రామంలో ఏడాది కుమారుడితో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది.
*మద్యం మత్తులో ఉన్న ఓ కుమారుడు తన తండ్రిని చంపేశాడు. ఈ దారుణ సంఘటన హర్యానాలోని కర్నాల్‌లో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.
*తమిళనాడు మధురై జిల్లాలోని మేలూరులో నెమళ్ల వేటగాడిని అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వేటగాడు ఏడు నెమళ్లను చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. వేటగాడి వద్ద ఉన్న నెమళ్ల కళేబరాలతో పాటు ఓ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
శంషాబాద్ విమానాశ్రయం నుండి యువతి అదృశ్యం-నేరవార్తలు-06/13
Related tags :