సతీష్ చంద్ర’… 1986 బ్యాచ్ రాజస్థాన్ కి చెందిన AP క్యాడర్ సివిల్ సర్వెంట్. BHU లో సివిల్ ఇంజనీరింగ్, IIT ఢిల్లీ లో ఎంటెక్ చేశాడు. కర్నూల్, నెల్లూరు జేసీ గా, ఈస్ట్ గోదావరి, రంగారెడ్డి కలెక్టర్ గా వర్క్ చేశారు. 2002 నుండి 2004 వరకు బాబు దగ్గర స్పెషల్ సెక్రటరీ టు సీఎంగా వున్నారు. 2014 లో CMO కి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా చంద్రబాబు ఎంచుకున్నారు. ఆంధ్ర జనాల, నాయకుల ప్రాధామ్యాలు, ఈగోలు, కాస్ట్ కాంప్లెక్సిటీ, మానసిక దౌర్బల్యాలు, ఆధిపత్య ధోరణులు, ప్రాంతీయ అభిమానాలతో ఉపరితల అవగాహన మినహా కోర్ లెవెల్ లో అస్సలు పరిచయం లేని వ్యక్తి. ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ కి అవసరం లేకపోవచ్చు కానీ రాజకీయానికి బాగా కావలసింది ఇదే….సర్వాధికారాలు CMO (ప్రిన్సిపల్ సెక్రటరీ) రూపంలో ఈయన దగ్గర కేంద్రీకృతం కావడం వల్ల ఎంత మంది ఈగోలు హర్ట్ అయ్యయో…!? ముఖ్యంగా IYR… CS ఆయనే అయినా CM తో అప్పోయింట్మెంట్ ఇప్పించాలసింది సతీష్ చంద్రనే. B.Corp చైర్మన్ గా వున్నప్పుడు కూడా ఇదే పరిస్థితి. అజేయా కళ్ళంని 2నెలలు CSగా చేసి మరీ రిటైర్ చేయించిన చంద్రబాబుకి ఎందుకు అతను ఎదురు తిరిగాడు అంటే… ఇదే కారణం… (CS, DGP గా రిటైర్ అవ్వడానికి సివిల్ సర్వెంట్స్ చేసే పాలిటిక్స్ చాలా దారుణంగా ఉంటాయి) సర్వెంట్స్ బాగా హర్ట్ అవడానికి ఈయనే సగం కారణం…ఒకసారి అద్దంకి MLA రవికుమార్ సీఎంని కలవడానికి సాయంత్రం దాకా వెయిట్ చేసి ఈయన టైం ఇవ్వకపోవడం తో వెళ్ళిపోయాడు. సీఎం దగ్గరగా ఉండాల్సింది అధికారులకా…!? MLAలకా…!? అశోకబాబు తేలిగ్గా కలిసేవాడు MLAల కన్నా CM ని. మిగిలినోళ్ళకి ఈయన్ని కలవడమే అతి కష్టంగా ఉండేది. ఇక ఈయనగారి లీలావైభోగాల గురించి ‘చంద్రికా స్వాంతనమే’ రాయొచ్చు.. ఇంటలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చేది ఈయన దగ్గరికేగా. ఎంత మంది MLA లని మార్చాలో చెప్పాలిగా… చెప్పాడా..? CMO రాగ ద్వేషాలకి అతీతంగా, ఆయనకి హెల్పింగ్ గా, పని విభజనతో సమర్థంగా పని చేయాలి. కానీ, జరిగింది వేరు !!
చంద్రబాబును పీక పట్టి గట్టిగా ముంచిన సతీష్‌చంద్ర
Related tags :