కాలేజీలు తెరవనున్నారు… ఈ విద్యా సంవత్సరంలోనూ సరికొత్త ఫ్యాషన్‌లు అమ్మాయిల్ని ఆకట్టుకోనున్నాయి. వాటిని తమ శరీరతత్వానికి తగ్గట్లు స్టైలింగ్ చేసుకోగలగడమే ఇప్పుడు అమ్మాయిల ముందున్న సవాల్. కాలేజీలో ఫ్యాషన్ ఐకాన్‌గా నిలవాలంటే… కుర్తీల నుంచి కాఫ్తాన్‌ల వరకూ ఎలా ఎంచుకోవచ్చో చెప్పే సూచనలివి.!ఇప్పటివరకూ సంప్రదాయంగా వాడిన స్ట్రెయిట్ హెమ్‌లైన్ కుర్తీలకు ఇక టాటా చెప్పేద్దాం…ఎందుకంటే ఎసెమెట్రికల్ డిజైన్‌లలో కుర్తీలను ఎంచుకోవడమే ఇప్పటి ఫ్యాషన్. ఈ డిజైను అన్ని రకాల శరీరాకృతుల వారికీ నప్పుతుంది. ఎత్తు తక్కువగా ఉన్నవారికి చక్కని ఎంపిక. స్నేహితులతో కలిసి బయటికి వెళ్లినప్పుడు, చిన్న చిన్న వేడుకలకి ఇవి స్టైలిష్ లుక్‌ని తెచ్చిపెడతాయి. వీటికి జతగా జీన్స్, పలాజోలు నప్పుతాయి. వీటిమీదకు స్నీకర్స్, స్ట్రాప్డ్ హీల్స్‌ని వేసుకోవచ్చు. ప్లెయిన్ స్ట్రెయిట్ కుర్తీ వేసుకున్నప్పుడు ఎసెమెట్రికల్ లాంగ్ జాకెట్‌ని ప్రయత్నించినా మీ లుక్ మారిపోతుంది. ఈ తరహా దుస్తులు వేసుకున్నప్పుడు చెవులకు వేలాడే లోలాకులు బాగుంటాయి. పామ్‌పామ్ ఇయర్‌రింగ్స్ సరైన మ్యాచింగ్.
మీ కాలేజీ స్టైల్ ఏంటి?
Related tags :