* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 14న దిల్లీకి వెళ్లనున్నారు. ఆ రోజు రాత్రి దిల్లీలోనే బసచేస్తారు. 15న ఉదయం దిల్లీలోని 1-జన్పథ్లో వైకాపా పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని ఆయన నిర్వహిస్తారు. పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఆ పార్టీ లోక్సభ పక్ష నాయకుడు మిథున్రెడ్డి సహా పార్లమెంటు సభ్యులంతా ఇందులో పాల్గొంటారు. ఎంపీలందరినీ 14వ తేదీ రాత్రికే దిల్లీకి చేరుకోవాలని వైకాపా నాయకత్వం వర్తమానం పంపింది. పార్లమెంట్ సమావేశాలు మొదలు కానున్న నేపథ్యంలో పార్టీ పరంగా సభలో ఏ అంశాలను లేవనెత్తాలి? రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీల అమలు, కేంద్రం నుంచి రాష్ట్రానికి సాయం వంటి పలు విషయాలపై ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయాలి? తదితర అంశాలపై భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్రపతి భవన్లో జరగనున్న నీతి అయోగ్ సమావేశంలో సీఎం పాల్గొంటారు. రాష్ట్రానికి అందించాల్సిన సాయంపై ఆయన ఈ సమావేశంలో నివేదించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
*అధికారపక్ష సభ్యులకు కౌంటర్లు విసిరిన చంద్రబాబు
స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన తమ్మినేని సీతారామ్‌కు ప్రతిపక్ష నేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.. ఈ సమయంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మైకుల గురించి ఆసక్తికర సంభాషణ జరిగింది.. మైకులు సరిగా పనిచేయడం లేదని చంద్రబాబు అన్నారు.. మైక్ మైక్ అంటూ చంద్రబాబు మాట్లాడుతుండగా అధికార పక్షం సభ్యులంతా ప్రతిపక్ష నేత వాయిస్ తగ్గిందంటూ చంద్రబాబుపై చలోక్తులు విసిరారు.. అదే సమయంలో వాయిస్ మరింత పెంచిన చంద్రబాబు అధికారపక్ష సభ్యులకు కౌంటర్లు విసిరారు.. మాటలొస్తాయని, మాటలకేం బాధలేదని అన్నారు.. సుదీర్ఘ అనుభవం ఉందని, రాజకీయాల్లో అన్నీ చూశామని చంద్రబాబు చెప్పారు. ఇదే సమయంలో అధికార పక్ష సభ్యులు సెటైర్లు వేయడంతో సభ మొత్తం నవ్వులు విరిశాయి.. ఆ వెంటనే చంద్రబాబు మళ్లీ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు.. మాటలు ఆటోమేటిక్‌గా వస్తాయని, మాటలు తగ్గవని, ఏం బాధలేదని అన్నారు.. మళ్లీ అధికార పక్ష సభ్యులు ఏదో అంటుండగా చంద్రబాబు కల్పించుకుని మా ఆధ్వర్యంలో మైకులు బాగానే పనిచేశాయని, మీ ఆధ్వర్యంలోనే ఇప్పుడు మైకులు ప్రాబ్లమ్ వచ్చాయని అన్నారు.. మీరు ముందు వాల్యూమ్ పెంచాలని, ఆ తర్వాత మా వాయిస్ ఆటోమేటిక్‌గా పెరుగుతుందని చంద్రబాబు అన్నారు. ఈ ఎపిసోడ్‌తో అసెంబ్లీలో కొంత ఆసక్తికర చర్చతోపాటు నవ్వులు విరబూశాయి.
*ఆఫీసుకు టైముకు రండి: కేంద్ర మంత్రులకు ప్రధాని
ప్రతి మంత్రీ టైమ్ను తప్పనిసరిగా పాటించాలని, సకాలంలో ఆఫీసులకు చేరుకోవాలని ప్రధాని మోడీ హితవుపలికారు. ఇంటి నుంచి పనిచేసే కల్చర్కు స్వస్తి పలకాలని, రెగ్యులర్గా ఆఫీసుకొచ్చి పనిచేయడానికే శ్రద్ధ చూపాలని, ఇతరులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు సూచనలు చేశారు. సహాయ మంత్రుల సేవలను వాడుకోవాలని, ముఖ్యమైన విధుల్లోనూ, కీలకమైన ఫైళ్ల పరిష్కారంలోనూ భాగస్వామ్యం కల్పించాలని చెప్పారు. మినిస్టర్స్, వారి జూనియర్స్ కలిసి కూర్చొని ఫైల్స్ను ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలన్నారు. ‘‘ఆఫీస్కొచ్చాక కనీసం ఐదు నిమిషాలు శాఖ పరిధిలోని లేటెస్ట్ డెవలప్మెంట్స్పై అధికారులతో చర్చించుకోవాలి” అన్నారు. మంత్రులకు, ఎంపీలకు తేడాలు లేవని, మంత్రులు కూడా ఎంపీలనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రతి మంత్రి వారి శాఖల పరిధిలో పక్కా ప్రణాళికను రూపొందించుకోవాలని, ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ఎలా వ్యవహరించాలన్న దానిపై కూడా మంత్రులకు ఆయన పలు సూచనలు చేసినట్లు సమాచారం.
*చట్ట సభలపై నమ్మకం కలిగిస్తాం: జగన్
ఏపీ శాసనసభ సభాపతిగా నియమితులైన తమ్మినేని సీతారామ్‌కు ప్రభుత్వం తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఈసందర్భంగా సభలో సీఎం మాట్లాడుతూ.. ‘‘ సౌమ్యూడైన తమ్మినేని శాసనసభకు ఆరుసార్లు ఎన్నికై మంచిపేరు తెచ్చుకున్నారు. చట్టసభలపై మళ్లీ నమ్మకం కలిగించాలనే సీతారామ్‌ను ఎంచుకున్నాం. వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని ఆలోచించి స్పీకర్ ఎంపికపై నిర్ణయం తీసుకున్నాం’’అని జగన్ అన్నారు.
*ఏపీ స్పీకర్‌గా తమ్మినేని బాధ్యతల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా వైసీపీ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం బాధ్యతలను స్వీకరించారు. స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ప్రొటెం స్పీకర్ శంబంగి చిన్న వెంకట అప్పలనాయుడు ప్రకటించారు. అనంతరం తమ్మినేని సీతారాంను స్పీకర్ చైర్ వద్దకు సీఎం జగన్, టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామనాయుడు, జనసేన నుంచి రాపాక కలిసి తీసుకెళ్లారు. ఆ తర్వాత స్పీకర్ తమ్మినేని చైర్లో కూర్చోబెట్టి.. సీఎం జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు. సీతారాం కళింగ(బీసీ) సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస నియోజకవర్గం నుంచి తొలిసారిగా 1983లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1985, 1991, 1994, 1999, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. 1979-80 జిల్లా బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా సేవలందించారు. 1985లో ప్రభుత్వ విప్‌గా, 1994లో న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. తరువాత 1995లో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా, 1999లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
*జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా- బుద్దా
ఇతర పార్టీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి వస్తే రాజీనామా చేసి రావాలని సీఎం జగన్ చెప్పడాన్ని తాను స్వాగతిస్తున్నానని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తెలిపారు. పోలవరం గురించి కనీసం సమీక్ష చేయకుండా గత ప్రభుత్వం పని తీరును ఎలా తప్పుబడతారని ప్రశ్నించారు. టీడీపీ ప్రవేశ పెట్టిన పథకాలను తొలగించినా.. మేము ఏం మాట్లాడటం లేదన్నారు. కొత్త ప్రభుత్వం పని తీరు చూసేందుకు కొంత సమయం వేచి ఉండాలని భావిస్తున్నామన్నారు. కానీ అనవసరంగా నోరు పారేసుకుంటే… మేము కూడా అదే స్థాయిలో సమాధానం చెబుతామని హెచ్చరించారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరనేది గుర్తు ఉంచుకుంటే మంచిదని హితవు పలికారు.
*కొలువుదీరిన ఆంధ్రప్రదేశ్ కొత్తసభ
కొత్తసభ్యుల ప్రమాణస్వీకారోత్సవంతో బుధవారం తొలిరోజు ఏపీ శాసనసభ అట్టహాసంగా ప్రారంభమైంది. మంత్రులు, శాసనసభ్యులు ఒకరినొకరు పలకరించుకుంటూ ఉత్సాహంగా పాల్గొన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల అధికారపార్టీ వైకాపా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మినహా సభ్యులంతా హాజరయ్యారు. సభ్యులకు స్థానాలు కేటాయించకపోవడంతో ఎవరికి నచ్చిన స్థానాల్లో వారు ఆసీనులయ్యారు. వైకాపా నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 15వ శాసనసభ తొలిసమావేశం ప్రొటెం స్పీకర్ శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అధ్యక్షతన ప్రారంభమైంది. ముహూర్తం ప్రకారం ఉదయం 10.18 గంటలకు ప్రొటెం స్పీకర్ తన కుటుంబ సభ్యులతో సభకు వచ్చి, సభాపతి స్థానంలో ఆసీనులయ్యారు.
*పరిషత్‌లకు పూర్వవైభవం తథ్యం
జిల్లా, మండల పరిషత్‌లకు పూర్వవైభవం ఖాయమని రాష్ట్ర ఆర్థిక సంఘం ఛైర్మన్ జి.రాజేశంగౌడ్ భరోసా వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పంచాయతీరాజ్, పురపాలక వ్యవస్థలను పటిష్ఠం చేయటం లక్ష్యంగా.. విస్తృత అంశాలతో నివేదికలు తయారు చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో పంచాయతీ, పరిషత్ ఎన్నికల క్రతువులు పూర్తయి.. త్వరలోనే పురపాలక సంఘాలూ ఎన్నికలకు వెళ్లబోతున్న తరుణంలో తెలంగాణ మొదటి ఆర్థిక సంఘం ఛైర్మన్ రాజేశంగౌడ్ ముఖాముఖిలో పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. గతంలో కరీంనగర్ జడ్పీ ఛైర్మన్‌గా, ఉమ్మడి రాష్ట్ర మంత్రిగానూ ఆయన పనిచేశారు.
*భాజపా లోక్‌సభాపక్ష నేతగా మోదీ
భాజపా బుధవారం పార్లమెంటరీ పార్టీ కార్యవర్గ సంఘాన్ని ప్రకటించింది. లోక్‌సభలో పార్టీ నాయకునిగా ప్రధాని నరేంద్ర మోదీ, ఉపనాయకునిగా రాజ్‌నాథ్ సింగ్ వ్యవహరిస్తారు. రాజ్యసభలో పార్టీ నేతగా కేంద్ర మంత్రి థావర్ చంద్ గహ్లోత్, ఉప నాయకునిగా పీయూష్ గోయెల్‌లను నియమించింది. ఇంతవరకు రాజ్యసభలో పార్టీ నాయకునిగా అరుణ్ జైట్లీ ఉండేవారు. అనారోగ్యం కారణంగా తనకు ఏ పదవీ అప్పగించవద్దని ఆయన కోరడంతో కొత్తవారిని నియమించింది.
*ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా రోజా
నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజాను ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా నియమించారు. దీనిపై నేడో రేపో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. మంగళవారం ఆమెను, మంత్రి పదవులు దక్కని మరికొందరు ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి తాడేపల్లిలోని తన కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు. వారందరికీ మంత్రి పదవులు ఇవ్వలేకపోవడానికి కారణాలను వివరిస్తూనే, వారికి భవిష్యత్తుపై భరోసా కల్పించారని తెలిసింది. ఈ నేపథ్యంలో రోజాకు ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ పదవిని ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తనను ఈ పదవిలో నియమించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ రోజా తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు.
*ఎప్పటికీ రాహులే మా అధ్యక్షుడు: సుర్జేవాలా
ఎప్పటికీ రాహుల్ గాంధీయే కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉంటారని పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా బుధవారం స్పష్టం చేశారు. ఈమేరకు పార్టీ అధ్యక్ష పదవిలో రాహుల్ గాంధీ కొనసాగడంపై నెలకొన్న అనిశ్చితికి తెర దించారు. అంతకుముందు కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోనీ నేతృత్వంలో పార్టీ సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, మల్లికార్జున్ ఖర్గే, గులాంనబీ ఆజాద్, పి.చిదంబరం, కె.సి.వేణుగోపాల్, జైరామ్ రమేశ్, ఆనంద్‌శర్మ, సుర్జేవాలాలు ఇష్టాగోష్టిగా సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు.
*మజ్లిస్‌కు ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు?
రాష్ట్రంలో అధికారపక్షం ప్రజాస్వామ్య ప్రక్రియను దగాచేసి అసెంబ్లీలో మజ్లిస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెరాసతో కలిసి పోటీచేసిన మజ్లిస్ ప్రతిపక్షం ఎలా అవుతుందని ప్రశ్నించారు. పార్టీరాష్ట్ర కార్యాలయంలో బుధవారం లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు సంబంధించి గతంలో కాంగ్రెస్ చేసింది, ఇప్పుడు తెరాస చేస్తున్నది తప్పేనన్నారు. చట్టంలోని లోపాల్ని అనుకూలంగా చేసుకుని పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతుండటం జుగుప్సాకరమన్నారు.
*ఎప్పటికీ రాహులే మా అధ్యక్షుడు: సుర్జేవాలా
ఎప్పటికీ రాహుల్ గాంధీయే కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉంటారని పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా బుధవారం స్పష్టం చేశారు. ఈమేరకు పార్టీ అధ్యక్ష పదవిలో రాహుల్ గాంధీ కొనసాగడంపై నెలకొన్న అనిశ్చితికి తెర దించారు. అంతకుముందు కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోనీ నేతృత్వంలో పార్టీ సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, మల్లికార్జున్ ఖర్గే, గులాంనబ ద్, పి.చిదంబరం, కె.సి.వేణుగోపాల్, జైరామ్ రమేశ్, ఆనంద్‌శర్మ, సుర్జేవాలాలు ఇష్టాగోష్టిగా సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు.
*ప్రజల మద్దతుంటే ఎన్నికలకు సిద్ధంకండి
కాంగ్రెస్ నాయకత్వంపై పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి తెలిపారు. నిజంగా ప్రజల మద్దతు ఉంటే తక్షణం రాజీనామాలు చేసి ఎన్నికలకు సిద్ధపడాలని వారికి సవాల్ విసిరారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. పార్టీ మారిన వారిని చీరి చింతకు కట్టాలన్న కేసీఆర్.. ఇప్పుడు రాజకీయ ఫిరాయింపులను ప్రోత్సహించడం దురదృష్టకరమన్నారు.
*డిప్యూటీ స్పీకర్ పదవి బిజదకా? వైకాపాకా?
లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిని స్నేహపూర్వకంగా వ్యవహరించే ప్రతిపక్షాలకు ఇవ్వాలని భాజపా నాయకత్వం భావిస్తోంది. ఈ పదవిని ప్రతిపక్షాలకు ఇవ్వాలన్న సంప్రదాయాన్ని అనుసరించి గతంలో అన్నాడీఎంకేకు ఇచ్చింది. ఈసారి ఎన్‌డీఏలో భాగస్వాములు కానప్పటికీ సన్నిహితంగా ఉంటున్న వైకాపాకుగానీ, బిజూ జనతాదళ్(బిజద)కుగానీ ఇవ్వాలని భావిస్తోంది.
*భాజపా పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శిగా బాలసుబ్రహ్మణ్యం
భాజపా పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శిగా కామర్సు బాలసుబ్రహ్మణ్యం మరోసారి నియమితులయ్యారు. భాజపా పార్లమెంటరీ పార్టీ కార్యవర్గాన్ని బుధవారం ప్రకటించారు. హైదరాబాద్‌కు చెందిన బాలసుబ్రహ్మణ్యం ఆరెస్సెస్ ప్రచారక్‌గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో పని చేశారు. 2007 నుంచి 2010 వరకు భాజపా జాతీయ మీడియా సహ కార్యదర్శిగా, నితిన్ గడ్కరీ అధ్యక్షునిగా ఉన్న సమయంలో లీగల్ సెల్ జాతీయ సహ కార్యదర్శిగా విధులు నిర్వహించారు. పలు ఆంగ్ల, తెలుగు పత్రికల్లోనూ ఆయన పాత్రికేయునిగా పని చేశారు.
*అవును..బెంగాల్‌ను గుజరాత్‌గా మారుస్తాం-భాజపా నేత దిలీప్ ఘోష్
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను గెలిపిస్తే రాష్ట్రాన్ని రెండో గుజరాత్‌గా మార్చేందుకు కృషి చేస్తామని, నిరుద్యోగులకు ఉద్యోగాలను సృష్టిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తెలిపారు. బెంగాల్‌ను జిహాదీలకు నిలయమైన బంగ్లాదేశ్‌గా మార్చటం కంటే ఇది ఎంతో మేలేనని అన్నారు. పశ్చిమబెంగాల్‌ను మరో గుజరాత్‌గా మార్చేందుకు భాజపా కుట్రలు పన్నుతోందన్న టీఎంసీ అధ్యక్షురాలు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపణలను తిప్పికొడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
*బాలస్వామి బాధ్యతల స్వీకారానికి గవర్నర్ సహా ఇద్దరు సీఎంలు
విశాఖలోని శ్రీ శారదా పీఠాధిపతి ఉత్తరాధికారి శిష్య సన్యాస దీక్షా స్వీకార పట్టాభిషేక కార్యక్రమం జూన్ 15, 16, 17 తేదీల్లో విజయవాడలోని గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో జరుగుతాయని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి వెల్లడించారు. బుధవారం హన్మకొండలో తమ నివాసానికి వచ్చిన ఆయనకు రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు దంపతులు, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్ దంపతులు స్వాగతం పలికారు. అనంతరం స్వరూపానందేంద్ర విలేకరులతో మాట్లాడుతూ.. విజయవాడలో జరిగే బాలస్వామి బాధ్యతల స్వీకారోత్సవ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌మోహన్‌రెడ్డి, ఇరు రాష్ట్రాల మంత్రులు, శిష్యులు వస్తారన్నారు.
*మోదీని ప్రసార మాధ్యమాలే పెద్ద నాయకుడిగా చిత్రీకరించాయి: ఏచూరి
ప్రధాని నరేంద్ర మోదీని పెద్ద నాయకుడిగా చిత్రీకరించింది ప్రసార మాధ్యమాలేనని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. చెన్నైలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ… రాజ్యాంగాన్ని కాపాడటం, మైనారిటీల భద్రతే తమ లక్ష్యమని తెలిపారు. ఈవీఎంల గురించి వరుసగా ఆరోపణలు వస్తున్నాయని, రిజర్వ్ బ్యాంకు, సీబీఐ తదితర అన్ని వ్యవస్థలను కేంద్ర ప్రభుత్వం నాశనం చేసిందని ధ్వజమెత్తారు.
*అధికారాన్ని కక్ష సాధింపునకు వాడొద్దు
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నూతన ప్రభుత్వం వచ్చీ రాగానే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆరోపించారు. తెదేపా కార్యకర్తలపై దాడులు చేయడం, అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలు, స్వాగత ద్వారాలు ధ్వంసం చేయడం విచారకరమని అన్నారు. గుంటూరులోని తెదేపా కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని రాష్ట్రాభివృద్ధికి ఉపయోగించాలని, కక్ష సాధింపు చర్యలకు వాడొద్దని హితవు పలికారు.
*పథకాలు నిలిపివేస్తే రైతులు హర్షించరు: యనమల
అమలులో ఉన్న పథకాలను నిలిపివేయాలని ప్రభుత్వం చూస్తే రైతులు హర్షించరని, ఈ విషయాన్ని వైకాపా నేతలు గుర్తించాలని శాసన మండలిలో తెదేపా నేత యనమల రామకృష్ణుడు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వాలు మారినా ప్రభుత్వ విధానాలు మారవని, ప్రజా ప్రయోజనాలే పరమావధి కావాలని ఆయన అభిప్రాయపడ్డారు.
*డిప్యూటీ స్పీకర్ పదవి బిజదకా? వైకాపాకా?
లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిని స్నేహపూర్వకంగా వ్యవహరించే ప్రతిపక్షాలకు ఇవ్వాలని భాజపా నాయకత్వం భావిస్తోంది. ఈ పదవిని ప్రతిపక్షాలకు ఇవ్వాలన్న సంప్రదాయాన్ని అనుసరించి గతంలో అన్నాడీఎంకేకు ఇచ్చింది. ఈసారి ఎన్‌డీఏలో భాగస్వాములు కానప్పటికీ సన్నిహితంగా ఉంటున్న వైకాపాకుగానీ, బిజూ జనతాదళ్(బిజద)కుగానీ ఇవ్వాలని భావిస్తోంది. వైకాపాకు 22 సీట్లు ఉండగా, బిజదకు 12 స్థానాలు ఉండడం గమనార్హం.
*భాజపా లోక్‌సభాపక్ష నేతగా మోదీ
భాజపా బుధవారం పార్లమెంటరీ పార్టీ కార్యవర్గ సంఘాన్ని ప్రకటించింది. లోక్‌సభలో పార్టీ నాయకునిగా ప్రధాని నరేంద్ర మోదీ, ఉపనాయకునిగా రాజ్‌నాథ్ సింగ్ వ్యవహరిస్తారు. రాజ్యసభలో పార్టీ నేతగా కేంద్ర మంత్రి థావర్ చంద్ గహ్లోత్, ఉప నాయకునిగా పీయూష్ గోయెల్‌లను నియమించింది. ఇంతవరకు రాజ్యసభలో పార్టీ నాయకునిగా అరుణ్ జైట్లీ ఉండేవారు. అనారోగ్యం కారణంగా తనకు ఏ పదవీ అప్పగించవద్దని ఆయన కోరడంతో కొత్తవారిని నియమించింది. పార్టీ చీఫ్ విప్‌గా సంజయ్ జయశ్వాల్ నియమితులయ్యారు
14న ఢిల్లీ వెళ్తున్న జగన్-రాజకీయ-06/13
Related tags :