DailyDose

కేసీఆర్ వాస్తుపూజలు-తాజావార్తలు–06/13

KCR To Perform Vaasthu Puja - June 13 2019 - Daily Breaking News

*బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ డేటింగ్ లో ఉంది. గతకొద్ది రోజులుగా నేట్టింత చక్కర్ల్ కొడుతున్న వార్త ఇది. సంగీతకారుడు మిశాల్ కృపనీతో డేటింగ్ లో ఉన్నట్లు ఆమె ఇన్ స్త్రాగ్రామ్ పోస్టులు చూస్తే అర్ధమవుతుంది. సామాజిక మాధ్యమాల్లో వీరిద్దరి ఖాతాలు చూస్తె ఇడి నిజమేనని అనిపిస్తుంది. కౌగిలించుకున్నట్లు నుడుతపైనా ముద్దుల పెడుతున్నట్లు ఫోటోలు నెటిజన్లు ఆకర్షిస్తున్నాయి.
*భారతినగర్‌లో ఇంటర్ విద్యార్థిని సాయిదుర్గ అదృశ్యమైంది. రామలింగేశ్వరనగర్‌లోని అమ్మమ్మ ఇంటికి వెళ్లి కనిపించకుండా పోయింది. పటమట పీఎస్‌లో తల్లిదండ్రుల ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
*ఉపాధిహామీ పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన పెండింగ్‌ నిధుల్ని కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. రాష్ట్రంలో చేపట్టిన ఉపాధి హామీ పనులకు గాను రాష్ట్రానికి రావాల్సిన మొత్తం నిధుల్లో రూ.708 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
*మీటూ కేసులో భాగంగా బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కు క్లీన్ చీట్ లభించింది. పదేళ్ళ క్రితం హార్న్ ఒకే ప్లీజ్ సెట్స్ లో నానా తనను లైంగికంగా వేధించారని సినీనటి తనుశ్రీ దత్తా ఏడాది క్రితం ఆరోపణలు చేశారు. పటేకర్ పై కేసు నమోదు చేశారు.
*సెంట్రల్ ఆర్మ్ డ్ రిజర్వ్ ఫోర్సెస్(సీఆర్పీఎఫ్) జవాన్లను టెర్రరిస్టులు బుధవారం దొంగ దెబ్బ తీశారు. జమ్మూకాశ్మీర్ అనంత్ నాగ్ లో రద్దీగా ఉన్న కె.పి.రోడ్ లో సీఆర్పీఎఫ్ కు చెందిన 116 బెటాలియన్ జవాన్లు, రాష్ట్ర పోలీసులు పికెటింగ్ కు వచ్చారు. ముఖానికి మాస్కులు కట్టుకుని అక్కడికి బైకుపై వచ్చిన ఇద్దరు టెర్రరిస్టులు, ఒక్కసారిగా జవాన్లపై బుల్లెట్ల వర్షం కురిపించారు. గ్రెనేడ్లు విసిరారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
*భాజపా పార్లమెంటరీ పార్టీ కార్యనిర్వాహక వర్గాన్ని పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. లోకసభాపక్ష నేతగా ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహరిస్తారు. ఉపసభాపక్షనేత బాధ్యతలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చేపట్టనున్నారు. రాజ్యసభాపక్ష నేతగా తవార్‌ చంద్‌ గెహ్లోత్‌, రాజ్యసభాపక్ష ఉప నేతగా పియూష్‌ గోయల్‌ వ్యహరించనున్నారు.
*గుజరాత్‌లో ‘వాయు’ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తీరం దాటే సమయం దగ్గర పడేకొద్దీ ఇది తీవ్రమవుతోంది. వర్షానికి ఈదురు గాలులు తోడవ్వడంతో గుజరాత్‌ తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి.
*ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కావేటి విజయానంద్‌ను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని ఈసీఐ స్పష్టం చేసింది.
*ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కావేటి విజయానంద్‌ను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని ఈసీఐ స్పష్టం చేసింది. విజయానంద్‌ ప్రస్తుతం ఏపీ జెన్‌కో సీఎండీ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన ఆయన 1992లో ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ సబ్‌ కలెక్టర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు.
*ఏపీ శాసనసభ సభాపతిగా నియమితులైన తమ్మినేని సీతారామ్‌కు ప్రభుత్వం తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఈసందర్భంగా సభలో సీఎం మాట్లాడుతూ.. ‘‘ సౌమ్యూడైన తమ్మినేని శాసనసభకు ఆరుసార్లు ఎన్నికై మంచిపేరు తెచ్చుకున్నారు.
*ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభాపతిగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్‌ ఎన్నికకు సంబంధించి బుధవారం ఆయన ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది.
*చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలలో శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మహాసంప్రోక్షణ.
*ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కావేటి విజయానంద్‌ను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని ఈసీఐ స్పష్టం చేసింది. విజయానంద్‌ ప్రస్తుతం ఏపీ జెన్‌కో సీఎండీ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన ఆయన 1992లో ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ సబ్‌ కలెక్టర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు.
*తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.భద్రాచలం ను ఏపికి కేటాయించే ప్రతిపాదన లేదురోండు రాష్ర్టాల ముఖ్యమంత్రులు అభివృద్ధి కోసం కలసి పనిచేస్తూన్నారు
*విశాఖ ముడసర్లోవ సమీపంలోని దీనదయాళపురం ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని అమెరికా నౌకాదళ బృందం బుధవారం సందర్శించింది. విశాఖపట్నానికి నౌకలో వచ్చిన ఈ బృందంలోని సభ్యులు.. రెండున్నర గంటల పాటు చిన్నారులతో కలిసి ఆటపాటలతో సందడి చేశారు. నగరానికి చెందిన కెన్‌ ఫౌండేషన్‌ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సుమారు 40 మంది నౌకాదళ సిబ్బంది పాల్గొన్నారు.
*రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో చేరేందుకు గత నెల 23, 24 తేదీల్లో ఆన్‌లైన్‌లో నిర్వహించిన ప్రవేశ పరీక్ష (టీఎస్‌ఐసెట్‌-2019) ఫలితాలను ఈనెల 14న విడుదల చేయనున్నట్లు కన్వీనర్‌ సీహెచ్‌.రాజేష్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షను కేయూ ఏడో సారి నిర్వహించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 58 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. మొత్తం 49 వేల మంది హాజరయ్యారు. శుక్రవారం సాయంత్రం 3.30 గంటలకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ టి.పాపిరెడ్డి, ఐసెట్‌ ఛైర్మన్‌, కేయూ ఉపకులపతి ఆచార్య ఆర్‌.సాయన్నతో కలిసి కేయూలో ఫలితాలను వెల్లడిస్తారని వివరించారు.
*కాంగ్రెస్‌ శాసనసభపక్షం తెరాసలో విలీనానికి సంబంధించిన వ్యవహారంలో ప్రతివాదులకు బుధవారం హైకోర్టు నోటీసులు జారీచేసింది. స్పీకర్‌ నేతృత్వంలోని ట్రైబ్యునల్‌ (స్పీకర్‌), శాసనసభా సచివాలయం, ఈసీతోపాటు 12మంది ఎమ్మెల్యేలకూ నోటీసులు జారీ చేసింది.
*విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న బడుల హేతుబద్ధీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నిర్ణయంతో వందలాది పాఠశాలలు మూతపడే అవకాశాలున్నాయి. విద్యాశాఖ అంచనా ప్రకారం ఆ సంఖ్య సుమారు 4 వేల వరకు ఉండొచ్చు.
*కాంగ్రెస్‌ శాసనసభాపక్షాన్ని తెరాస శాసనసభాపక్షంలో విలీనం చేయడం రాజ్యాంగబద్ధమేనని కాంగ్రెస్‌ నుంచి తెరాసలో చేరిన 12 మంది ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.
*కేంద్ర ప్రభుత్వంతో ఈసారి కూడా తటస్థ వైఖరినే అవలంబించాలని తెరాస భావిస్తోంది. తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యంగా రాజీలేని పోరాటం చేయాలని, ప్రజావ్యతిరేక నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకించాలని అనుకుంటోంది.
*ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌, జస్టిస్‌ ఎం.వెంకటరమణ నియమితులయ్యారు. వీరి నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. వీరి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 13కు చేరింది. కొత్త న్యాయమూర్తులు సోమవారం ప్రమాణం చేయనున్నట్లు సమాచారం. వీరి నియామక విషయమై సుప్రీంకోర్టు కొలీజియం ఈ ఏడాది ఏప్రిల్‌ 16న కేంద్రానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే.
*విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన ఇంటర్‌ పరీక్షా ఫలితాల తీరును మరవక ముందే.. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు రాసిన అభ్యర్థులకూ కుమురం భీం జిల్లాలో విపత్కర పరిస్థితి ఎదురైంది. తపాలాశాఖలో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే దీనికి కారణం.
*ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని, అక్కడ నిష్ణాతులైన బోధకులు ఉన్నారంటూ తల్లిదండ్రులకు పదేపదే వివరించే ఉపాధ్యాయులు, అధికారులు… తమ పిల్లలను మాత్రం ప్రైవేటు విద్యా సంస్థల్లో చేర్పిస్తుండటం తెలిసిందే. తన కుమార్తెను వికారాబాద్‌ జిల్లా కేంద్రంలోని శివారెడ్డిపేటలోని మైనారిటీ సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో చేర్పించి అలాంటి వారికి ఆదర్శంగా నిలిచారు వికారాబాద్‌ జిల్లా పాలనాధికారి మస్రత్‌ ఖనమ్‌ అయేషా.
* నిమ్స్‌ ఆసుపత్రి నుంచి టీపీసీసీ కార్యానిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క బుధవారం డిశ్చార్జి అయ్యారు. ఎమ్మెల్యేల విలీన అంశాన్ని వ్యతిరేకిస్తూ దీక్ష చేసి, అరెస్టయి మూడు రోజులుగా నిమ్స్‌లో చికిత్స పొందిన భట్టి ఆరోగ్యం కుదుట పడటంతో బుధవారం డిశ్చార్జి చేసినట్లు వైద్యులు తెలిపారు.
*అగ్రిగోల్డ్‌ వ్యవహారంలో డబ్బు తీసుకున్నామనే ప్రచారంతో తెలుగుదేశం పార్టీ నేతలపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఏపీ ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావు ఆరోపించారు.
*ఏపీకి ప్రత్యేక హోదా, ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని నిబంధనలను నెరవేర్చే అంశాలకు సంబంధించిన వ్యాజ్యం సుప్రీంకోర్టులో అపరిష్కృతంగా ఉందని కేంద్ర ప్రభుత్వం తరఫున సహాయ సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) కృష్ణమోహన్‌ హైకోర్టుకు తెలిపారు.
*ఆంధ్రప్రదేశ్‌ను పర్యాటకుల స్వర్గధామంగా మారుస్తామని రాష్ట్ర పర్యటక, యువజన సర్వీసులు, సాంస్కృతికశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌ తెలిపారు. అవినీతికి తావులేకుండా ఏకగవాక్ష పద్ధతిలో ప్రాజెక్టులకు అనుమతులిస్తామని చెప్పారు.
*ఎన్నికల ప్రణాళికలో ముఖ్యమంత్రి జగన్‌ ప్రజలకు ఇచ్చిన హామీల అమలే తన తొలి ప్రాధాన్యమని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి స్పష్టం చేశారు. సచివాలయంలోని రెండో బ్లాక్‌లో ఉన్న తన కార్యాలయంలో వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ మంత్రి బుధవారం బాధ్యతలు స్వీకరించారు.
* ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగానే భావించి ఇక నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించినట్లు రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు.
*రానున్న రోజుల్లో రాష్ట్రంలోని పేదలందరికీ వంద శాతం ఇళ్లు నిర్మించి తీరుతామని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ప్రకటించారు.
*హైదరాబాద్‌ నగరంలోని హైదర్‌గూడలో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస గృహా సముదాయాలను ఈ నెల 17వ తేదీన ప్రారంభించనున్నారు. ఏరువాక పౌర్ణమి నాడు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్స్‌ ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ నివాస గృహాలను స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. 17న ఉదయం 6 గంటలకు కొత్త నివాసాలకు కేసీఆర్‌ గృహవాస్తు పూజలు చేయనున్నారు.