మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి కీలక పదవి దక్కింది. సీఎం జగన్ ఆయనను రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ)కు ఛైర్మన్‌గా నియమించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి. మంగళగిరిలో తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. ఆళ్లకు మంత్రిపదవి ఖాయమని భావించినా కేబినెట్లో ఆయనకు స్థానం దక్కలేదు. ఈ నేపథ్యంలో రాజధాని నిర్మాణ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న సీఆర్డీఏ సంస్థకు ఛైర్మన్‌గా నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.
CRDA ఛైర్మన్‌గా ఆళ్ల
Related tags :