కథానాయికలు కేవలం నటనకే పరిమితం కావడం లేదు. తమలోని సకల కళల్నీ బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. కొంతమంది నిర్మాణ రంగంవైపు అడుగుపెట్టాలని చూస్తుంటే, ఇంకొంతమంది సృజనాత్మక రంగంలోనే ప్రయత్నించడానికి సన్నద్ధం అవుతున్నారు. పూజా హెగ్డే కూడా తనలోని కొత్త ప్రతిభని ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటోంది. త్వరలోనే గాయనిగా అవతారం ఎత్తాలనుకుంటోంది. పూజా హెగ్డేకి సంగీతం అంటే ప్రాణం. ఖాళీ సమయాల్లో హిందీ, దక్షిణాది పాటల్ని వింటూ ఉంటుంది. అప్పుడప్పుడూ పాడుతుంది కూడా. ఈసారి తెలుగు ప్రేక్షకులకు తనలోని గాయనిని పరిచయం చేయాలనుకుంటోందట. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కలయికలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో పూజానే నాయిక. ఈ చిత్రం కోసం పూజ తొలిసారి గొంతు సవరించుకోబోతోందని సమాచారం. పూజ కోసం తమన్ ఎలాంటి ట్యూను సిద్ధం చేశారో, పూజ గాయనిగా ఎన్ని మార్కులు సంపాదించుకుంటుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
పాటల పూజా
Related tags :