త్వరలో ప్రారంభం కాబోతున్న రియాలిటీ షో ‘బిగ్‌బాస్-3’కు వ్యాఖ్యాతగా వ్యవహరించేందుకు తాను సిద్ధమేనని నటి రేణూదేశాయ్ అన్నారు. బిగ్‌బాస్-3లో రేణూదేశాయ్ పార్టిసిపేట్ చేయబోతున్నారని వస్తున్న వార్తలపై తాజాగా ఆమె ఓ ఆంగ్ల మీడియాతో స్పందించారు. బిగ్‌బాస్ నిర్వాహకులు ఎవరూ తనను సంప్రదించలేదని ఆమె స్పష్టం చేశారు. ఒకవేళ తనను ఎవరైనా సంప్రదిస్తే తాను షోలో పార్టిసిపేట్ చేయనని, కేవలం వ్యాఖ్యాతగా అయితే మాత్రమే చేస్తానని రేణూ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.తన తదుపరి చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌తో తాను బిజీగా ఉన్నానని, అందువల్ల వందరోజులు బిగ్‌బాస్ హౌస్‌లో ఉండలేనని ఆమె చెప్పారు. అందుకే వారానికి ఒకసారి మాత్రమే పని ఉండే వ్యాఖ్యాతగా అయితే మాత్రం చేయడానికి సిద్ధమేనని ఆమె తెలిపారు. తాను మళ్లీ నటన మొదలు పెట్టాలనుకుంటున్నానని ఈ సందర్భంగా రేణూ వెల్లడించారు.తన పెళ్లి విషయం హాట్ టాపిక్ కావడంతో రేణూ దేశాయ్ ఇటీవల సోషల్‌మీడియాలో చర్చనీయాశంగా మారిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్-3లో రేణూ దేశాయ్ పాల్గొనబోతున్నారనే వదంతులు వ్యాపించాయి. తాను వ్యాఖ్యాతగా అయితే మాత్రమే చేస్తానని చెబుతూ అన్నింటిపై రేణూ క్లారిటీ ఇచ్చేశారు. బిగ్‌బాస్ షో మూడో సీజన్‌కు అక్కినేని నాగార్జున వ్యాఖ్యతగా వ్యవహరించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. విక్టరీ వెంకటేశ్ కూడా బిగ్‌బాస్ హోస్ట్‌గా చేసేందుకు ఓకే చెప్పారని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నాగార్జున, వెంకటేశ్, రేణూ దేశాయ్‌ల్లో నిర్వాహకులు ఎవరిని హోస్ట్‌గా ఎంపిక చేస్తారో వేచి చూడాలి.!
బిగ్‌బాస్ కంట్రోల్ ఇస్తే చేస్తా
Related tags :