Devotional

తిరుమలలో శుక్రవారం వీఐపీ బ్రేక్ రద్దు

TTD Cancels VIP Break Darshans On Every Friday

ప్రతి శుక్రవారం వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు టీటీడీ అధికారుల నిర్ణయం. గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు తిరుమల శ్రీవారికి నిర్వహించే అభి షేకం ఇతర సేవల కారణాల వల్ల సంవత్సరం పొడవునా ప్రతి శుక్రవారం వీఐపీ బ్రేక్‌ దర్శ నాలు ప్రొటోకాల్‌ పరిధిలోని ప్రముఖులకే టీటీడీ అధికారులు పరిమితం చేశారు. ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించ బోమని స్పష్టం చేశారు. అలాగే గతంలో నిర్ణయించిన మేరకు వేసవి రద్దీ దృష్ట్యా ఏప్రిల్‌ 15 నుంచి జూలై 15వ తేదీ వరకు శని, ఆదివారాల్లో కూడా వీఐపీ బ్రేక్‌ దర్శనాలను ప్రొటోకాల్‌ పరిధిలోని వీఐపీలకు మాత్రమే పరిమితం చేశారు. వీఐపీలు, భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించా లని అధికారులు విజ్ఞప్తి చేశారు.