NRI-NRT

రేపు సిన్సినాటీలో ప్రారంభం కానున్న “గోదావరి” శాఖ

Godavari restaurants opening in Cincinnatio OH On June 15th

అమెరికావ్యాప్తంగా అద్భుతమైన భారతీయ రుచుల ప్రవాహాన్ని విస్తరిస్తున్న “గోదావరి” సంస్థ తాజాగా ఒహాయో రాష్ట్రంలోని సిన్సినాటీలో శనివారం నాడు తన నూతన విభాగాన్ని ప్రారంభించనుంది. ఇప్పటికే కెనడా దేశంలోని టొరంటోలో ఈ సంస్థకు విభాగం ఉండగా, అమెరికాలోని పలు నగరాల్లో తమ శాఖల ద్వారా నాణ్యమైన, రుచికరమైన వంటకాలను వినియోగదారులకు అద్భుతంగా అందిస్తోంది. పైనాపిల్ రసం, దొండకాయ చికెన్, తందూరి కొర్రమీను, లూంగీ బిరియానీ వంటి వినూత్న వంటకాలతో ఇప్పటి వరకు 10లక్షలకు పైగా బిరియానీలూను తమ ఆధ్వర్యంలో వడ్డించామని గోదావరి సీఈఓ కోగంటి కౌశిక్ తెలిపారు. అతి త్వరలోనే జెర్సీ సిటీ, మినియాపోలిస్, హైదరాబాద్, మాంట్రియాల్, వాంకూవర్ తదితర నగరాల్లొ కూడా తమ శాఖలను విస్తరిస్తామని ఆయన తెలిపారు. సిన్సినాటీ ప్రాంత ప్రజలు తమ శాఖను ఆదరిస్తారని నమ్మకం ఉందని కౌశిక్ ఆశాభావం వెలిబుచ్చారు.

గోదావరికి సంబంధించిన మరింత సమాచారం కొరకు – www.godavarius.com

సిన్సినాటీ గోదావరి సమాచారం

GODAVARI CINCINNATI
5947 Deerfield Blvd
Mason, OH 45040
Ph: 513-770-0444

Raja Munaga
361-222-4222
Cincinnati@godavarius.com