DailyDose

కేంద్ర మంత్రికి బెదిరింపులు-నేరవార్తలు–06/14

Indian Central Home Minister Gets Warning Calls - June 14 2019 - Daily Crime News

*కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇంటర్నెట్ వాయిస్ కాల్స్ ద్వారా కొందరు అజ్ఞాత వ్యక్తులు చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీనిపై మంత్రి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐపీ అడ్రస్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. కిషన్ రెడ్డి ఇంటి దగ్గర కూడా భద్రతా బలగాల సంఖ్యను పెంచారు.
*దేశ రాజధానిలో దారుణం జరిగింది. ఫుడ్‌ డెలివరీ బాయ్‌ అనుకొని తలుపు తీసిన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వివరాలు.. అమిత్‌ కొచ్చార్‌(35) అనే వ్యాపారవేత్త ఢిల్లీలోని వికాస్‌పురిలో భార్యతో కలిసి నివసిస్తున్నాడు. గురువారం రాత్రి భార్య ఆఫీస్‌కి వెళ్లిన తర్వాత కొచ్చార్‌ స్నేహితులు అతని ఇంటికి వచ్చారు. దాంతో స్నేహితుల కోసం ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేశాడు కొచ్చార్‌. కొంత సమయం తర్వాత కాలింగ్‌ బెల్‌ మోగింది. ఫుడ్‌ డెలివరీ బాయ్‌ వచ్చాడనుకొని కొచ్చార్‌ తలుపు తీశాడు.
*విజయనగరం జిల్లా బొబ్బిలిలో శుక్రవారం మధ్యాహ్నం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. అక్కడి పారిశ్రామికవాడలోని బాలాజీ కెమికల్స్‌ ఫ్యాక్టరీలో బాయిలర్‌ పేలిపోయింది.
*ఆరిజోనా-మెక్సికో సరిహద్దులో భారత్‌కు చెందిన ఏడేళ్ల బాలిక మృతిచెందింది. మరో నలుగురు భారతీయులతో కలిసి బాలిక యూఎస్‌కు అక్రమంగా వలస వెళ్తుంది. వీరిలో ఇద్దరిని బొర్డర్ పెట్రోలింగ్ ఏజెంట్స్ టస్కన్ ప్రాంతంలో కాల్చిచంపారు. మరో ఇద్దరు మెక్సికోకు తిరిగి వెళ్లినట్లు గుర్తించారు. పారిపోయిన వారి కోసం భూ, వాయు మార్గంలో తనిఖీలు చేపట్టారు.
*జగిత్యాలలో దొంగల ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు . అదుపులోకి తీసుకున్న వారిని విచారణ చేయగా దొంగలుగా తేలింది. వీరి వద్ద నుంచి పదకొండు తులాల బంగారంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో నలుగురు మహిళలు ఉన్నారు.
*జ‌మ్మూక‌శ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఇవాళ ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. భ‌ద్ర‌తా ద‌ళాలు జ‌రిపిన కాల్పుల్లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారు.
* అప్పు చెల్లించలేదని ఓ మహిళను కరెంటు స్తంభానికి కట్టేసి చెప్పులతో దాడి చేశారు. ఈ ఘటన కార్నాటక రాష్ట్రంలోని కొడిగేహళ్లిలో జరిగింది. రాజమణి అనే మహిళ ఓ వ్యక్తి వద్ద రూ. 50 వేలు అప్పుతీసుకుంది. ఆ డబ్బు తిరిగి చెల్లించడంలో ఆలస్యం జరుగడంతో సదరు వ్యక్తి మహిళను వేధింపులకు గురిచేశాడు. కరెంటు స్తంభానికి కట్టేసి చెప్పులతో, చీపుర్లతో దాడి చేయించాడు.
* ఫిరాయింపులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసి కేసీఆర్ నేర్చుకోవాలని సీపీఐ నారాయణ హితవు పలికారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా సీపీఐ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఏఐటీయూసీ కార్యాలయం నుంచి ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహానికి వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు.
* అస్సాం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్‌పై సామాజిక మాధ్యమంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజెపి ఐటి సెల్‌ సభ్యుడు నీతు బోరాను అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఇక్కడకు వలస వచ్చిన ముస్లిం సెటిలర్లనుంచి స్థానిక అస్సామీలను రక్షించలేకపోతున్నదని నీతుబోరా సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. రాష్ట్రంలో ఈ పరిస్థితికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి సోనోవాల్‌దేనని ఆయన వ్యాఖ్యానించారు.
* విజయనగరం జిల్లా బొబ్బిలి పారిశ్రామిక వాడలోని బాలాజీ కెమికల్స్‌ పరిశ్రమలో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. పరిశ్రమలోని బాయిలర్‌ పేలడంతో విధుల్లో ఉన్న ఇద్దరు కార్మికులు మృతి చెందారు.
* కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డికి బెదిరింపు కాల్స్‌ రావడంతో హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల 20న ఇంటర్నెట్‌ వాయిస్‌ కాల్స్‌ ద్వారా బెదిరింపు కాల్స్‌ వచ్చాయని కిషన్‌రెడ్డి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 69734063 నంబర్‌ నుంచి అజ్ఞాత వ్యక్తులు కాల్‌ చేసి చంపుతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
* బందరులో గుట్కా విక్రేత అరెస్ట్
గుట్టుగా గుట్కా ప్యాకెట్లు అమ్ముతున్న ఒక వ్యక్తి పట్టుబడ్డాడు.స్థానిక చిలకలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత గుట్కా ప్యాకెట్లు జోరుగా అమ్ముతున్న జె చిరంజీవ శ్రీనివాసరావు అనే వ్యక్తిని గురువారం పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోనికి తీసకొన్నారు.ఈ సందర్భంగా శ్రీనివాసరావు నుండి రూ.44,121/-లు విలువ చేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
* వినుకొండ మండలం విఠంరాజుపల్లి గ్రామం వద్ద కారు చెట్టును డీ కొన్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.
వైజాగ్ కు చెందిన నలుగురు వ్యక్తులు శ్రీశైలం నుండి వైజాగ్ వెళ్తుండగా శుక్రవారం తెల్లవారుజామున విఠంరాజుపల్లి చర్చి వద్ద కారు చెట్టును ఢీకొట్టింది. ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
* నూజెండ్ల మండలం పువ్వాడ మరియు ములకలూరు గుండ్లకమ్మ నది ప్రాంతంలో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తుండగా పువ్వాడ, ములకలూరు గ్రామములో నీగ్రామ నౌకర్లు మరియు వీఆర్వోలు మరియు Riనాసరయ్య గారి ఆధ్వర్యంలో
3 ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని అయినవోలు ఎస్ఐ గారికి అప్పగించారు.చెట్టును ఢీ కొన్న కారు, ముగ్గురు మృతి
* ఓ చిరుత గొర్రెల మందపై దాడి చేసి 35 గొర్రెలను చంపిన ఘటన మండలంలోని హులికల్లు గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. బాధితుడు హనుమంతు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆత్మకూరు మండలం వేలపచెర్ల గ్రామానికి చెందిన హనుమంతు, వెంకటేశులు, రామన్న, నారప్ప కలిసి గొర్రెలు మేపుకొంటూ ఊరూరా తిరిగే వారు. వారం రోజుల క్రితం ఈ గ్రామానికి వచ్చారు. పగలంతా గొర్రెలను మేపి రాత్రి సమయంలో గ్రామానికి రెండున్న కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. మేత సరిగా లేక పోవడంతో 150 గొర్రెలను మరో చోటకు సాయంత్రం తీసుకెళ్లారు. ఇనుప జాలి ఏర్పాటు చేసి గొర్రెలను అందులో వదిలారు. కొండ సమీపంలో నుంచి చిరుత వచ్చి మందపై దాడి చేసింది. చుట్టూ కంచె ఉండడంతో గొర్రెలు తప్పించుకునేందుకు ఆస్కారం లేక పోయింది. దీంతో చిరుత మందలో ఉన్న 35 గొర్రెలను చంపివేసింది. కాపరి ప్రాణభయంతో గ్రామంలోకి వెళ్లి విషయాన్ని తెలిపాడు. కొంత సేపటికి మంద వద్దకు వెళ్లి చూసే సరికి సరికి గొర్రెలు అన్ని మృతి చెందాయి. గొర్రెలు మొత్తం చిరుత దాడిలో మృతి చెందాయని ఇక ఎలా జీవనం సాగించాలని కన్నీరుమున్నీరుగా విలపించాడు. సుమారు రూ.2లక్షల పైగా నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
* వినుకొండ మండలం విఠoరాజుపల్లి గ్రామం వద్ద కారు చెట్టును డీ కొన్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. వైజాగ్ కు చెందిన నలుగురు వ్యక్తులు శ్రీశైలం నుండి వైజాగ్ వెళ్తుండగా శుక్రవారం తెల్లవారుజామున విఠoరాజుపల్లి చర్చి వద్ద కారు చెట్టును ఢీకొట్టింది. ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది
* పొన్నూరు మండలం మన్నవ గ్రామంలో తెదేపా నాయకుడిపై దాడి. తెదేపా నాయకుడు బండ్లమూడి బాబురావుపై వైకాపా కార్యకర్తలు దాడి. బాబురావు వ్యక్తి పరిస్థితి విషమం, గుంటూరు ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపు.
* మరదలిపై గత ఆరేళ్లుగా బావ అత్యాచారానికి పాల్పడడంతో గర్భవతి అయిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. నిందితుడిని పోలీసులు ఫోక్సో చట్టం కింద అరెస్ట్‌ చేశారు. కన్యాకుమారి జిల్లా కరుత్తన్‌గోడు సమీపంలో ఉన్న గ్రామానికి చెందిన అయ్యప్పన్‌ (30) భవన నిర్మాణ కాంట్రక్టర్‌గా ఉన్నాడు.
* తిరుపతిలోని వినాయక నగర్‌ వసతిగృహంలో శుక్రవారం తితిదే ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తితిదే జేఈవో కార్యాలయంలో సంపత్‌(38) అటెండర్‌గా పనిచేస్తున్నాడు. గత పది రోజులుగా సెలవులో ఉన్న సంపత్‌ ఇంట్లో ఎవరూ లేని సమయంలో పంచితో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించి తలుపులు పగులగొట్టి సమీపంలో ఉన్న రుయా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సంపత్‌ మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
* పొన్నూరు మండలం మన్నవ గ్రామంలో తెదేపా నాయకుడిపై దాడి. తెదేపా నాయకుడు బండ్లమూడి బాబురావుపై వైకాపా కార్యకర్తలు దాడి. బాబురావు వ్యక్తి పరిస్థితి విషమం, గుంటూరు ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపు.
*తమిళనాడులోని ఏడు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బుధవారం చేపట్టిన సోదాలు గురువారం రెండోరోజూ కొనసాగాయి.
*సినీ ప్రముఖుడు దివంగత దాసరి నారాయణరావు కుమారుడు దాసరి తారక ప్రభు(43) కనిపించడం లేదంటూ ఆయన మామ సురేంద్రప్రసాద్‌ బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
*తూర్పుగోదావరి జిల్లా తుని మండలం వి.కొత్తూరు కూడలి వద్ద జాతీయ రహదారిపై గురువారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వైకాపా నాయకులు దుర్మరణం పాలయ్యారు.
*ఛార్జింగ్‌ పెట్టే సమయంలో ఓ స్మార్ట్‌ ఫోన్‌ పేలిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో చోటుచేసుకుంది. మణుగూరు మండలం సమితి సింగారానికి చెందిన మట్టా శివకృష్ణ బుధవారం రాత్రి ఇంట్లో మొబైల్‌కు ఛార్జింగ్‌ పిన్‌ పెట్టిన వెంటనే దాన్నుంచి పొగలు వచ్చాయి. దీంతో చేతిలో ఉన్న మొబైల్‌ను నేలపైకి విసిరేశాడు. వెంటనే అది భారీ శబ్దంతో పేలింది.
*ఛార్జింగ్‌ పెట్టే సమయంలో ఓ స్మార్ట్‌ఫోన్‌ పేలిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో చోటుచేసుకుంది.
*మంత్రి సీహెచ్‌ మల్లారెడ్డిపై సామాజిక మాధ్యమాల్లో గుర్తు తెలియని వ్యక్తులు అసత్య కథనాలు ప్రసారం చేస్తున్నారంటూ ఆయన ఓఎస్‌డీ సుధాకర్‌రెడ్డి హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
*వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ప్రయాణికులు విదేశాల నుంచి బంగారం అక్రమంగా తీసుకొస్తూ శంషాబాద్‌ భద్రతాధికారులకు పట్టుబడ్డారు. నిందితులు సదరు బంగారాన్ని క్యాప్సుల్స్‌ రూపంలో ప్రమాదకరంగా మల ద్వారంలో పెట్టుకొని వచ్చినట్లు అధికారులు తెలిపారు.
*ప్రముఖ షార్ట్‌ వీడియో మేకింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌ వినోదంతో పాటు విషాదాన్ని నింపుతోంది. ఆ యాప్‌ వాడొద్దని తన భర్త మందలించాడని మనస్తాపం చెందిన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది.
*తెలంగాణలో కలకలం రేపుతున్న మనుషుల అదృశ్యంపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్న ముగ్గురు వ్యక్తులను హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు.
*ట్రాన్స్‌ ఫార్మర్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ఓ పాత విడిభాగాల గోదాంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటన విజయవాడ జక్కంపూడి జేఎన్‌యూఆర్‌ఎం కాలనీలో జరిగింది. గోదాం సమీపంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ షార్ట్‌సర్క్యూట్‌కు గురైంది.
*మంత్రి సీహెచ్‌ మల్లారెడ్డిపై సామాజిక మాధ్యమాల్లో గుర్తు తెలియని వ్యక్తులు అసత్య కథనాలు ప్రసారం చేస్తున్నారంటూ ఆయన ఓఎస్‌డీ సుధాకర్‌రెడ్డి హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
*ఉత్తరప్రదేశ్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతకర రీతిలో పోస్టులు పెట్టినందుకుగానూ పలువురు వ్యక్తుల్ని అరెస్టు చేసిన ఘటన ఇటీవల సంచలనం సృష్టించింది. అయితే ముఖ్యమంత్రిని సామాజిక మాధ్యమాల్లో దుర్భషలాడినందుగానూ ఏకంగా 119 కేసులు కేరళలో నమోదైన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.