Movies

నిజాయితీ తెలుసుకోవడానికి అధరచుంబనం

Kiara wants to know honesty in love - So agreed for lip locks

‘‘కబీర్‌ సింగ్‌’ అనేది భిన్నమైన ప్రేమకథ. ఇలాంటి సినిమాల్లో ప్రేమను వ్యక్తం చేయడానికి లిప్‌లాక్‌ చాలా అవసరం. పెదవి, పెదవి కలిసినప్పుడే ఇద్దరిలో ఎంత ప్రేమ ఉందనేది నిజాయతీగా బయట పడుతుంది. అందుకోసమే ఈ చిత్రంలో లిప్‌లాక్‌ చేయాల్సి వచ్చింది’’ అని కియారా అడ్వాణీ అన్నారు. తెలుగు ‘అర్జున్‌రెడ్డి’కి రీమేక్‌గా వంగా సందీప్‌ రెడ్డి హిందీలో తెరకెక్కించిన చిత్రం ‘కబీర్‌సింగ్‌’. ఇందులో షాహిద్‌ కపూర్‌తో ముద్దు సన్నివేశాల గురించి కియారాను అడిగితే ఇలా సమాధానమిచ్చారు. ‘‘రా లవ్‌స్టోరీకి లిప్‌లాక్‌ అనేది చాలా అవసరం. ప్రేమికుణ్ణి ఓ అమ్మాయి ఎంతగా ప్రేమించిందో ఆ ముద్దు తెలియజెబుతుంది. ప్రేమికుల ఽమధ్య చాలా నార్మల్‌ ఇది. బలవంతంగా ఇరికించిన ముద్దు సన్నివేశాలు ఈ సినిమాలో లేవు. ఇందులో ప్రతి ముద్దు సన్నివేశానికి ఓ అర్థముంటుంది. ముద్దు సన్నివేశం నిజాయతీగా, రియలిస్టిక్‌గా ఉండాలని అలా చేశాం. కథలో భాగమది’’ అని తెలిపారు. ఈ నెల 21న కబీర్‌సింగ్‌ ప్రేక్షకుల ముందుకురానుంది.