‘‘జీవితాల్లో మార్పు సహజమని తెలుసు. కానీ అతి తక్కువ సమయంలోనే, నమ్మశక్యం కాని రీతిలో నా జీవితం మారిపోయింద’’ని చెబుతోంది కథానాయిక రష్మిక మందన్న. తెలుగులో వరుసగా అగ్ర కథా నాయకుల సరసన అవకాశాలు అందుకుంటూ బిజీగా గడుపుతోంది. కన్నడలో ప్రయాణం మొదలుపెట్టిన రష్మిక, తెలుగుతోపాటు తమిళంలోనూ నటిస్తోంది. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చినా స్టార్ నాయికగా ఎదిగారు కదా, వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుందని అడిగితే ‘‘ఇది నా జీవితమేనా లేక, వేరొకరి జీవితంలోకి నేనొచ్చానా అనిపిస్తుంది. చిన్నప్పుడు మా ఊరు నుంచి బెంగళూరుకి రావడమే పెద్ద విషయం నాకు. అక్కడ చదువుకోవాలనేది నా కల. అది తీరడంతోపాటు అనుకోకుండా సినిమా అవకాశం కూడా లభించింది. స్టార్ అనే గుర్తింపుపై నమ్మకం లేదు కానీ.. ఇన్ని చిత్రాల్లో అవకాశాలు అందుకుంటూ బిజీగా గడపడం లాంటి విషయాలు గుర్తుకొచ్చిన ప్రతిసారీ ఆశ్చర్యంగా ఉంటుంది. మొదట్లో సినిమా నా జీవితంలో ఓ భాగం అనుకొనేదాన్ని, ఇప్పుడు సినిమానే జీవితం అనిపిస్తోంద’’ని చెప్పింది రష్మిక.
నమ్మలేను
Related tags :