ఆంధ్రప్రదేశ్ మామిడికి ప్రసిద్ది గాంచిందని, 3.82 లక్షల హెక్టార్లలో సాగు వుందని, 45 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వుందని ఉద్యాన శాఖ కమీషనర్ చిరంజీవి చౌదరి అన్నారు. శనివారం స్థానిక బ్లీస్ హోటల్ లో మామిడి పండించే రైతులతో, కొనుగోలుదార్లు, ఎగుమతి దార్లతో బయ్యర్స్ అండ్ సెల్లర్స్ మీట్ మ్యాంగో-2019 ఒక్కరోజు అవగాహన సదస్సు ను ఉద్యాన శాఖ, ఆపెడా సంయుక్తంగా ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో (APEDA) ఛైర్మన్ Paban kumar Borthakur The Agricultural and Processed Food Products Export Development Authority బైయర్స్, సెల్లర్స్ మీట్ ఆన్ మ్యాంగో 2019 సదస్సు లో ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడుతూ రైతులకోసం రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుని ప్రధానంగా పండ్లు, కాయగూరలు, పూలు అభివృధ్ధి , ఎగుమతులకు ప్రోత్సాహం వంటివి నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఆపేడ ఆన్ లైన్ అందుబాటులో వుందని రైతులు , ఎగుమతిదారులు, కొనుగోలు దారులు రిజిస్ట్రేషన్ తో దళారులులేని వ్యాపారలావాదేవీలకు సహకరిస్తుందని సూచించారు. రైతులు 8112 మండి ఆపెడాలో నమోదు చేసుకుని వున్నారని తెలిపారు. ఈ నెల 26 ,27 లక్నోలో బైయర్స్, సెల్లర్స్ మీట్ జరపనున్నామని వివరించారు. కమీషనర్ ఉద్యాన శాఖ మాట్లాడుతూ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో అత్యధిక మామిడి విస్తీర్ణం 1 లక్ష 18 వేల హెక్టార్లలో వుందని 15 లక్షల టన్నుల పైగా దిగుబడి వస్తున్నదని అన్నారు. వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనేందుకు రైతులు పంట కుంటలు నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. కొత్త రాష్ట్రంలో 3 అంతర్జాతీయ విమానాశ్రయాలు, పోర్టులు వున్నాయని మరో 6 నెలల్లో కార్గో సేవలు ప్రారంభించడానికి అడుగులు పడుతున్నాయని మరో 2, 3 సంవత్సరాలలో పూర్తి స్థాయి అన్నారు. మామిడి నిల్వలకు శ్రీసిటిలో భూమి కేటాయింపు జరిగిందని త్వరలో నిర్మాణాలు ప్రారంభమవుతాయని అన్నారు. గత సంవత్సరంలో 3,375 మెట్రిక్ టన్నులు చిత్తూరు జిల్లా నుండి ఎగుమతి జరిగితే 2019 లో అది 8612 మెట్రిక్ టన్నులకు చేరిందని వివరించారు. మామిడి రైతుల ఆదాయం లక్ష్యంగా కొనుగోలు దారుల, ఎగుమతి దారుల సూచనలు పంట సమయంలో వాడాల్సిన ఎరువులు, మందుల వాడకం సూచనలు పాటించాలని తెలిపారు. సౌత్ కొరియా, గల్ఫ్, యూరప్ దేశాలకు ఏ పి నుండి ఎగుమతులు చేయడం జరిగిందని అన్నారు. మ్యాంగో ఫార్మర్స్ ప్రభుత్వ రాయితీలు ఉపయోగించుకొని దిగుబడి పెంచి ఆదాయం పొందాలని సూచించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ రకాల మామిడికి చిత్తూరు జిల్లా ప్రసిద్ధని అన్నారు. రైతులు ఎగుమతి కోసం ఎగుమతి దారులు నిర్దేశించిన విధంగా సైజు, రంగు, చుక్కలు లేకుండా జాగ్రత్త పడాలని తెలిపారు. ఎగుమతికి ప్రాధాన్యత ఇవ్వగలిగితే రైతులు మరింత ఆదాయం పొందగలుతారని అన్నారు. నేడు వర్షాభావ పరిస్త్తితులు చూస్తే జిల్లాలో దాదాపు 2000 హెబిటేషన్లకు త్రాగునీరు, పశువులకు రవాణా చేస్తున్నామని తెలిపారు. రైతులు నీటి నిల్వల కోసం పంట కుంటల పై దృష్టి పెట్టాలని, రైతులు ఎలాంటి అవసరాలైనా తమ దృష్టికి తీసుకు వస్తే ప్రభుత్వానికి నివేదించి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. కొనుగోలు దారులు,ఎగుమతి దారులు జిల్లా నుండి వివిధ ప్రాంతాల నుండి హాజరైన దాదాపు 200 మంది రైతులకు పలు రకాల సూచనలు చేస్తూ, అవసరమని తలిస్తే తమ ఫోన్ నంబర్లు మీ వద్ద ఉంచుకొని సహాయం పొందవచ్చని, తమ కంపెనీల పని తీరును రైతుల కందిస్తున్న ప్రోత్సాహాలను వివరించారు. ఈ సమావేశం లో ఎగుమతి దారులు ముంబై నుండి రైన్ బో ఇంటర్నేషనల్, గురుకృప కొర్పోరేషన్ , కె బి ఎక్స్ పోర్టర్స్, వేజీ ప్రెస్ ఫుడ్ అసోసియేషన్ లు, వివిధ ప్రాంతాల నుండి రాష్ట్రాల నుండి హోటా ఆగ్రో , బి వి ఎస్ ఇంటర్నేషనల్, ఏ సి ఎస్, నవ్య ఫూడ్స్, కాప్రి కార్న్, లైఫ్ స్టైల్, గల్లా ఫుడ్స్ , జైన్ ఫోడ్స్ , వర్షా ఫుడ్స్ వంటి దాదాపు 40 కంపెనీలు పాల్గొనగా జిల్లాలోని 10 మండలాల నుండి 200 మంది రైతులుపైగా హాజరు అయ్యారు. ఈ సదస్సులో జెడి హార్టికల్చర్ వెంకటేశ్వర్లు, డిడి కె.వి.రమణ రావు, ఎపి ఎం ఐపీ పిడి విద్యా శంకర్ , ఎడి లు పివి రమణ , సుబాషిణి , ఉద్యాన శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఏపీలో 3.82 లక్షల హెక్టార్లలో మామిడి సాగు
Related tags :