రైల్వే శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకొని మోసం చేశారంటూ క్రికెట్ క్రీడాకారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు, ఆయన తనయుడు శివరామ్‌లపై కేసు నమోదు చేశామని నరసరావుపేట రెండో పట్టణ సీఐ ఆళహరి శనివారం తెలిపారు. సీఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం యవ్వారిపేట గ్రామానికి చెందిన బి.నాగరాజు క్రికెట్‌లో ఆంధ్ర రంజీ జట్టుకు ఆడాడు. ఆయనకు గతంలో భరత్‌చంద్ర అనే వ్యక్తితో పరిచయం ఉంది. అతను రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి కోడెల శివరామ్ వద్దకు నాగరాజును తీసుకెళ్లాడు. ఒప్పందం ప్రకారం 2017 డిసెంబర్ 31న ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పడంతో రూ.15 లక్షలు శివరామ్‌కు నాగరాజు చెల్లించాడు. నెలలు గడిచినా ఉద్యోగం ఇప్పించకపోవడంతో డబ్బు తిరిగి ఇవ్వాలని కోరాడు. శివరామ్ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆయన తండ్రి శివప్రసాదరావును ఫోన్‌లో సంప్రదించానని, ఆయన నుంచి కూడా ఎలాంటి సమాధానం రాలేదని నాగరాజు ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కోడెల శివప్రసాదరావు, ఆయన తనయుడు శివరామ్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ ఆళహరి తెలిపారు.
కూతురు కుమార్తె అయింది. ఇప్పుడు కోడెలపైనే కేసు.
Related tags :