హిమాలయ దేశమైన నేపాల్‌లో స్కూళ్లలో చైనా భాష మాండరిన్‌ను నేర్పించనున్నారు. దీనికి సంబంధించిన ఉపాధ్యాయులకు జీతభత్యాలను చైనా రాయబార కార్యాలయం నుంచి చెల్లిస్తారు. దీంతో చాలా స్కూళ్లలో విద్యార్థులు మాండరిన్ నేర్చుకోవడాన్ని నిర్బంధం చేశారు. ఇప్పటికే పది ప్రైవేటు స్కూళ్లలో ప్రధానోపాధ్యాయులు ఈ విషయాన్ని అంగీకరించినట్లు ది హిమాలయన్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. పొఖారా, ధులిఖెల్ ఇతర ప్రాంతాల్లోని పలు స్కూళ్లలో కూడా మాండరిన్ నిర్బంధం చేశారని ఎల్‌ఐఆర్ స్కూల్ ఛైర్మన్ శివరాజ్ పంత్ వెల్లడించారు. నేపాల్‌లోని పాఠశాల్లో విదేశీభాషను నేర్పించడం ఎప్పటి నుంచో జరుగుతోంది. కానీ ఎప్పుడూ నిర్బంధం చేయలేదు. కాకపోతే దీనిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రైవేటు పాఠశాలలే ఈ నిర్ణయాన్ని తీసుకొంటున్నాయి. పాఠశాలల నిర్వహణ ఖర్చులు కలిసొస్తాయనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నట్లు సమాచారం. కేవలం మాండరిన్ నేర్పే టీచర్‌కు వసతి, ఆహారం అందిస్తే చాలు.. జీతభత్యాలను కాఠ్‌మాండూలోని చైనా రాయబార కార్యాలయం చెల్లిస్తుంది. దీనిపై చైనా రాయబారి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.
నేపాలీ చిన్నారులకు చైనీస్ పాఠాలు
Related tags :