Food

ముల్లంగి గుండె జబ్బులను దూరం చేస్తుంది

Eating raddish will prevent from heart diseases

కొన్ని కూరగాయల్ని మనం నిర్లక్ష్యం చేస్తుంటాం. అందులో ముల్లంగి ఒకటి. దానిలోని పోషకాలు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.
* ముల్లంగి శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. క్యాన్సర్‌ కణాలు వృద్ధి చెందకుండా కాపాడుతుంది.
* ముల్లంగిలో కెలొరీలు చాలా తక్కువ. ఆశ్చర్యం అనిపించినా ఇది నిజం. విటమిన్‌ సితోపాటు ఇతర పోషకాలు ఉండే దీనిలో పిండిపదార్థాలూ సున్నా. బరువు తగ్గాలనుకునేవారికి ఇది చక్కని ఆహారం అంటారు పోషకాహార నిపుణులు.
* కొన్నిరకాల ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు నివారించడంలో ఈ దుంప కీలకంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీఫంగల్‌ గుణాలే అందుకు కారణం.
* ఇందులో విటమిన్‌ సి, జింక్‌, ఫాస్ఫరస్‌ వంటివి చర్మం పొడిబారకుండా చేస్తాయి. మొటిమల్నీ నివారించి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
* ఫ్లవనాయిడ్లు ముల్లంగిలో అధికం. ఇవి గుండెకు రక్తసరఫరా సరిగ్గా జరిగేలా చూస్తాయి. గుండె జబ్బుల నుంచి కాపాడతాయి. దీన్ని పదార్థాలుగానే కాదు, సలాడ్‌రూపంలోనూ తీసుకోవచ్చు.