‘మహానటి’ సినిమాలో అద్భుతంగా నటించి నటిగా ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నారు కథానాయిక కీర్తీ సురేష్. ‘మీరు ఎలాంటి పాత్రలను ఇష్టపడతారు. భవిష్యత్‌లో ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు?’ అనే ప్రశ్నను కీర్తి ముందు ఉంచితే.. ‘‘నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలి. ప్రేక్షకుల మెప్పు పొందాలి. ఏదో ఒక జానర్‌కే పరిమితం కావడం నాకు ఇష్టం లేదు. ‘క్వీన్’ సినిమాలో కంగనా రనౌత్, ‘మరియాన్’లో పార్వతి చేసిన పాత్రలంటే నాకు చాలా ఇష్టం. కానీ అలాంటి పాత్రలే నాకు రావాలని కోరుకోను.నాకు వచ్చిన అవకాశాల్లో నచ్చిన పాత్రలకు ఓకే చెబుతుంటాను. నిజానికి నేను భవిష్యత్ గురించి పెద్దగా ఆలోచించను. కాలంతో ముందుకు వెళ్తుంటా’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం నరేంద్రనాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉమెన్‌సెంట్రిక్ ఫిల్మ్ కోసం స్పెయిన్‌లో ఉన్నారు ఈ బ్యూటీ. అలాగే నగేష్ కుకునూరు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. మరోవైపు బాలీవుడ్‌లో అజయ్ దేవగణ్ హీరోగా తెరకెక్కనున్న ఓ స్పోర్ట్స్ బయోపిక్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
కాలంతో ముందుకు వెళ్తుంటా
Related tags :