WorldWonders

నేను చచ్చిపోతా-అనుమతి ఇవ్వండి

Madhya Pradesh Swamy Vairagyananda Appeals For Mercy Suicide

సజీవ సమాధి అయ్యేందుకు అనుమతించాలని మధ్యప్రదేశ్ కు చెందిన స్వామి వైరాగ్య నంద ఉన్నతాధికారులతో విజ్ఞప్తి చేశారు. ఇటీవల జరిగన లోక్ సభ ఎన్నికల్లో భోపాల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన దిగ్విజయ్ సింగ్ విజయం సాధిస్తారని ఆయన జోస్యం చెప్పారు. దిగ్గీరాజా గెలవకుంతె సజీవ సమాధి అవుతానని ఆయన ప్రకటించారు. భాజపా అభ్యర్ధి ప్రజ్ఞా టాకూర్ చేతిలో దిగ్విజయ్ 3.60 లక్షల ఓట్ల తేడాతో ఘోర పరాజయం పాలయ్యాడు. ఈనేపద్యంలో నైరాగ్యానందను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. దీంతో ఆయన సజీవ సామాదికి అనుమతి కోరుతూ భోపాల్ కలెక్టర్ దరఖాస్తు పెట్టుకున్నారు. ప్రస్తుతం నేను కామ్ఖ్యాదాంమ్లో ఉంటున్నాను. మాట నిలబెట్టుకునేందుకు జూన్ పదహారున మధ్యాహ్నం 2.11 గంతాకు సజీవ సమాధిలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. స్థానిక యంతరంగం నాకు సహకరిస్తుందని నమ్ముతున్నాను అని దరఖాస్తులో నైరగ్యనంద పేర్కొన్నారు. దీనికి అనుమతి ఇవ్వొద్దని తానూ డీఐజీకు లేఖ రాసినట్లు కలెక్టర్ తరుణ్ కుమార్ తెలిపారు. వైరాగ్యానంద ను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించినట్టు చెప్పారు. కంప్యుటర్ బాబాగా గుర్తింపు పొందిన నామ్ దేవ్ దాస్ త్యాగి కూడా ఎన్నికల సమయంలో దిగ్విజయ్ సింగ్ కు మద్దతుగా యజ్ఞ యాగాదులు రోడ్ షోలు నిర్వహించారు దిగ్విజయ్ స్వయంగా వీటిల్లో పాల్గొన్నారు.