Sports

బింద్రేపై మనస్సుపడ్డ అక్తర్

Shoaib Akhtar Wanted To Kidnap Sonali Bendre Due To His Crush

పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌కు అప్పట్లో బాలీవుడ్‌ నటి సోనాలీ బింద్రే అంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని గతంలోనే చాలాసార్లు బహిరంగంగా వెల్లడించాడు కూడా. అప్పట్లో దీనిపై పెద్ద దుమారమే రేగింది. తను అంటే చాలా ఇష్టమని అక్తర్‌ పదే పదే చెప్పడం కూడా సోనాలీకి ఆగ్రహం తెప్పించిన సందర్భాల్లో కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే అసలు అక్తర్‌ ఎవరో తనకు తెలియదని సోనాలీ బింద్రే ఒకానొక సందర్భంలో వ్యాఖ్యానించి ఆ ‘రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌’కు గట్టి కౌంటరే ఇచ్చారు.అయితే తాజాగా ఓ చాట్‌షోలో మరోసారి సోనాలీ బింద్రే ప్రస్తావన తీసుకొచ్చాడు అక్తర్‌. తన ప్రేమకోసం ఏకంగా ఆమెను కిడ్నాప్‌ చేద్దామనుకున్నాడట. సోనాలీ నటించిన ‘ఇంగ్లీష్‌ బాబు దేసీ మేమ్‌’ అనే బాలీవుడ్‌ మూవీతో ఆమెపై ఇష్టాన్ని పెంచుకున్నాననీ.. అప్పట్నుంచి సోనాలీ ఫొటోను తన జేబులోనే పెట్టుకొని తిరిగేవాడినని చెప్పుకొచ్చాడు. ఒకవేళ తన ప్రేమను ఒప్పుకోకపోతే.. సోనాలీని కిడ్నాప్‌ కూడా చేయాలనుకున్నానని ఆ షోలో తెలిపాడు.