తెలంగాణలో పంచాయతీ సర్పంచులు, ఉప సర్పంచులకు రాష్ట్ర ప్రభుత్వం చెక్ పవర్ కల్పించింది. దీనికి సంబంధించి శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 12 వేలకు పైగా పంచాయతీలకు ఎన్నికలు ముగిసి నూతన పాలకమండళ్లు కూడా కొలువుదీరాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేసిన పంచాయతీ రాజ్ చట్టంలో సర్పంచులతో పాటు, ఉప సర్పంచులకు సంయుక్తంగా చెక్‌పవర్ కల్పించింది. పంచాయతీ రాజ్ చట్టం-2018లోని చెక్ పవర్‌కు సంబంధించి సెక్షన్లను ప్రభుత్వం తాజాగా నోటిఫై చేసింది. దీని ప్రకారం గ్రామపంచాయతీ నిధులకు సంబంధించి ఇద్దరికీ సంయుక్తంగా చెక్ పవర్ లభిస్తుంది. ఈ నెల 17 నుంచి ఈ చెక్‌పవర్ అమల్లోకి రానుంది.
తెలంగాణా సర్పంచ్‌లకు సరికొత్త శక్తి
Related tags :