కథానాయిక కీర్తి సురేష్‌ను అభిమానులు గుర్తు పట్టలేకపోతున్నారు. ఇన్నాళ్లూ కాస్త బొద్దుగా ఉన్న ఈ భామ ఇప్పుడు నాజూకుగా తయారయ్యారు. సినిమాలో పాత్ర కోసం జిమ్‌లో కసరత్తులు చేసి మరీ బరువు తగ్గారు. ఇటీవల ఆమె వ్యాయామశాలలో దిగిన ఫొటో కూడా వైరల్ అయ్యింది. కాగా ఆమె ప్రస్తుతం స్పెయిన్‌లో ఉన్నారు. అక్కడ దిగిన ఫొటోల్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. ఓ ఫొటోలో బ్లూ కలర్ స్కర్ట్, కళ్లద్దాలతో దర్శనమిచ్చారు. అయితే అందులో ఆమె గుర్తుపట్టలేని విధంగా ఉన్నారు. ఈ ఫొటోకు అభిమానుల నుంచి తెగ రియాక్షన్స్ వచ్చాయి. ‘మీరు చాలా సన్నగా అయ్యారు. గుర్తు పట్టలేకపోయా, మీ క్యూట్ బుగ్గలు ఇకలేనట్టేనా? చాలా అందంగా ఉన్నారు..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అదేవిధంగా కీర్తి సురేష్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో స్పెయిన్ రైలులో ప్రయాణిస్తుండగా దిగిన ఫొటోను పంచుకున్నారు. ఇందులోనూ ఆమె గుర్తు పట్టలేని విధంగా కనిపించారు. ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ‘సఖి’ సినిమా షూటింగ్ కోసం కీర్తి సురేష్ స్పెయిన్ వెళ్లినట్లు తెలిసింది. మరోపక్క ఆమె ‘మన్మథుడు 2’లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఆమె స్టిల్స్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో నాగార్జున కథానాయకుడి పాత్ర పోషిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక. సమంత కీలక పాత్రను పోషిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. గురువారం విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన లభించింది.
ఆమె కీర్తి సురేషా?
Related tags :