టెక్నాలజీ రంగంలో బ్రిటన్ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే దేశాల్లో అమెరికాతో పాటు భారత్ అగ్రస్థానంలో నిలిచింది. టెక్‌నేషన్ అనే సంస్థ బ్రిటన్‌లో టెక్నాలజీ వీసా దరఖాస్తులను పరిశీలిస్తుంది. భారతదేశం నుంచి వచ్చే దరఖాస్తులు 2017-18లో 450 ఉంటే, 2018-19లో అవి 650కి పెరిగాయని ఆ సంస్థ తెలిపింది. భారతదేశంతో పాటు అమెరికా నుంచే ఎక్కువ సంఖ్యలో వీసా దరఖాస్తులు వచ్చాయని చెప్పింది. సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, ఏఐ, మెషీన్ లెర్నింగ్, ఫిన్‌టెక్, ఎంటర్‌ప్రైజ్/క్లౌడ్ రంగాల్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, బిజినెస్ డెవలపర్లు ఎక్కువగా వీసాల కోసం దరఖాస్తు చేశారని టెక్‌నేషన్ నివేదిక తెలిపింది. ఈ రెండు దేశాల తర్వాత.. నైజీరియా, రష్యా, కెనడా, ఆస్ట్రేలియా, చైనా, దక్షిణాఫ్రికా ఉన్నాయని వివరించింది. డిజిటల్ టెక్నాలజీ, ఇంజినీరింగ్, వైద్యం, శాస్త్రవిజ్ఞానం, కళలు, మీడియా రంగాల్లో టైర్ 1 ఎక్సెప్షనల్ టాలెంట్ వీసా దరఖాస్తుల పరిశీలనకు టెక్‌నేషన్ సహా ఐదు సంస్థలను యూకే నియమించింది.
భారతీయులు బ్రిటన్ అంటే ఇష్టపడుతున్నారు
Related tags :