‘మణికర్ణిక’ సినిమా బుచియన్ ఇంటర్నేషనల్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అన్నారు. చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు ఈ సినిమాను మెచ్చుకోలేదని, ఇప్పుడు ఈ ఘనత సాధించడం వారికి చెంప పెట్టులాంటిదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కంగన మాట్లాడుతూ.. ‘ఈ వార్త మమ్మల్ని థ్రిల్‌కు గురి చేసింది. ‘గల్లీబాయ్’ సినిమాపై మొత్తం చిత్ర పరిశ్రమ ప్రశంసల జల్లు కురిపించింది. కానీ ‘మణికర్ణిక’ గురించి ఒక్కరూ మాట్లాడలేదు. ‘మూవీ మాఫియా’ నా సినిమాను చంపేయాలి అనుకుంది. కానీ , సినిమా కమర్షియల్ హిట్ అందుకుంది. ఇప్పుడు అంతర్జాతీయంగా చిత్రానికి గుర్తింపు లభించింది. ఇది ‘మూవీ మాఫియా’కు చెంప పెట్టులాంటిది. వాళ్లంతా కలిసి, ఎన్ని చేసినా ఓ మంచి సినిమాను ఆపలేరు. ప్రత్యేకించి సోషల్‌మీడియా ద్వారా ప్రపంచం మొత్తం ఒక్కటైన ఈ కాలంలో అది సాధ్యం కాని పని’ అని అన్నారు.
సినీమాఫియాకు ఇదొక మాంచి దెబ్బ
Related tags :