Food

చింతచిగురుతో పచ్చడి చేసుకుంటే….

Try this spicy tamarind leaves chutney this summer - Telugu easy short fast pickle recipes

*** కావల్సినవి:
చింతచిగురు – కప్పు, నువ్వులు – మూడు చెంచాలు, ఆవాలు, – చెంచా, ధనియాలు – చెంచా, మెంతులు – పావు చెంచా, ఎండుమిర్చి – పది, పచ్చిమిర్చి – ఐదు, నూనె – టేబుల్‌స్పూను, కరివేపాకు – రెండు రెబ్బలు, మినప్పప్పు, సెనగపప్పు – అరచెంచా చొప్పున, ఇంగువ – చిటికెడు, ఉప్పు – తగినంత.

*** తయారీ:
బాణలిలో నూనె వేడిచేసి ఇంగువా, నువ్వులూ, ఆవాలూ, ధనియాలూ, మెంతులూ, ఎండుమిర్చి, మినప్పప్పూ, సెనగపప్పు వేసి వేయించుకోవాలి. అన్నీ వేగాక దింపేసి కరివేపాకూ, కడిగిన చింతచిగురూ తాలింపులో వేసేయాలి. ఈ తాలింపు చల్లారాక మిక్సీ జారులోకి తీసుకుని, పచ్చిమిర్చి, తగినంత ఉప్పూ వేసుకుని మెత్తగా రుబ్బుకుంటే చాలు. నోరూరించే చింతచిగురు పచ్చడి సిద్ధం. కావాలనుకుంటే ఇందులో కొద్దిగా నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. ఆపై పోపు వేసుకుంటే స‌రి నోరూరించే చింతచిగురు నువ్వుల ప‌చ్చ‌డి రెడీ.