‘కూలీ నెం.1’లో జంటగా నటించారు వెంకటేష్, టబు. తెలుగులో టబుకి తొలి చిత్రమిదే. తొలి అడుగుతోనే స్టార్‌గా మారిపోయింది. ఆ సినిమా వచ్చి ఇరవై ఏళ్లు గడిచాయి. ఆ తరవాత వెంకీ – టబు కలసి నటించలేదు. ఇంతకాలానికి వీరిద్దరూ వెండితెరపై సందడి చేయబోతున్నట్టు సమాచారం. బాలీవుడ్లో విజయవంతమైన చిత్రం ‘దే దే ప్యార్ దే’. అజయ్‌దేవగణ్, టబు, రకుల్‌ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్‌తో రీమేక్ చేస్తున్నారు. టబు పాత్ర మళ్లీ ఆమెకే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయమై చిత్రబృందం ఇప్పటికే టబుని సంప్రదించగా, తను సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. వెంకటేష్ ప్రస్తుతం ‘వెంకీ మామ’తో బిజీగా ఉన్నారు. అది పూర్తయిన తరవాతే ‘దే దే ప్యార్ దే’ రీమేక్ పట్టాలెక్కవచ్చు. దర్శకుడు, ఇతర చిత్రబృందం వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
20ఏళ్లకు మళ్లీ….
Related tags :