బరువు తగ్గాలనుకుంటే నిద్ర మీద కూడా దృష్టి పెట్టాలి. కంటి నిండా నిద్ర లోపిస్తే, ఇన్సులిన్ స్థాయుల్లో హెచ్చుతగ్గులు, ఎమోషనల్ ఈటింగ్ మొదలైన సమస్యలు తలెత్తుతాయి. ఇవన్నీ శరీర బరువును పెంచేవే! అయితే నిద్రకు తోడ్పడే ఈ పానీయాలను నిద్రకు ముందు తాగితే ప్రయోజనం ఉంటుంది. పాలు: పాలలోని ట్రిప్టోఫాన్, కాల్షియం, కెసీన్ ప్రొటీన్లు గాఢ నిద్రలోకి జారుకునేటందుకు దోహదపడతాయి. కెసీన్ జీర్ణప్రక్రియను నెమ్మదింపజేసి గాఢనిద్రలో ఉండగా కండరాల నిర్మాణానికి తోడ్పడతుంది. ఫలితంగా పరోక్షంగా కండరాలు బలపడి, ఫిట్నెస్ సొంతమవుతుంది. ద్రాక్ష రసం: గాఢ నిద్ర పట్టడంతోపాటు, నిద్రావస్థలో కొవ్వు కరిగేలా చేసే గుణం ద్రాక్ష రసానికి ఉంది. ద్రాక్షలోని యాంటీ ఆక్సిడెంట్లు, శరీరంలో ఇన్సులిన్ స్రావాన్ని క్రమపరిచి, జీవ గడియారం కరెక్టుగా పని చేసేలా తోడ్పడతాయి. దాల్చిన చెక్క తేనీరు: దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్లు ఉంటాయనే విషయం మనకు తెలుసు. నిద్రకు ముందు ఈ చెక్క పొడితో తయారుచేసిన తేనీరు తాగితే మెటబాలిజం పెరుగుతుంది. అలాగే శరీరంలోని మలినాలు కూడా బయటకు వెళ్లిపోతాయి. దాంతో బరువు కూడా తగ్గుతారు. మెంతుల నీళ్లు: మెంతులు నానబెట్టిన నీళ్లు క్రమం తప్పకుండా తాగడం వల్ల ఒంట్లో వేడి ఎక్కువై, బరువు పెరగకుండా ఉంటాం! జీర్ణవ్యవస్థ మెరుగైన పనితీరు కోసం కూడా మెంతుల నీళ్లు తాగాలి. అయితే నిద్రకు అరగంట ముందు తాగినప్పుడే ఈ ప్రయోజనాలు దక్కుతాయి.
జీర్ణవ్యవస్థ మెరుగైన పనితీరు కోసం మెంతుల నీళ్లు
Related tags :