క్రీడా పరిశోధకులు వెల్లడించిన వివరాల ఆధారంగా చూస్తే క్రీ.శ 600 ఏళ్లకు పూర్వం క్రికెట్ ఆట ప్రారంభమైంది. ఆక్స్ఫర్డ్ లైబ్రరీలో ఇద్దరు వ్యక్తులు బాల్, బ్యాట్తో ఆడుతున్న చిత్రం ఉంది. లిఖిత పూర్వకమైన ఆధారాలను బట్టి మొట్ట మొదటి క్రికెట్ పోటీ 1744 జూన్ 18న కెంట్ – లండన్ జట్ల మధ్య జరిగింది. ఈ పోటీలో లండన్ ఓడిపోయింది. క్రికెట్ ఆటను తరువాత 1803లో ఆస్ట్రేలియాలో ప్రారంభించారు. 1868లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఇంగ్లండ్ వెళ్లి 47 మ్యాచ్లు ఆడింది. అందులో 14 మ్యాచుల్లోగెలిచింది. 14 మ్యాచుల్లో ఓడింది. 19 మ్యాచ్లు ఫలితం తేలకుండా ముగిశాయి. 1744 తరువాత కొన్ని సంవత్సరాలకు క్రికెట్ ఆటకు నియమ నిబంధనలురూపొందించారు. తొలుత వికెట్స్ మధ్యన 22 గజాల దూరం ఉండాలని నిర్ణయించారు. మొదట్లో వికెట్లు రెండు కర్రలతోనే ఉండేవి. క్రికెట్ బ్యాట్ ఇప్పటిలా నిటారుగా కాకుండా హాకీస్టిక్ ఆకారంలో ఒంపు తిరిగి ఉండేది.కాలక్రమేణా క్రికెట్ ఆటలో అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకోవడమేగాక విశ్వవ్యాప్తం అయింది.
ఇదిరా అబ్బాయి…క్రికెట్ చరిత్ర
Related tags :