*ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో భారత వృద్ధి అంచనాలను వరుసగా రెండో సారి ఫిచ్ తగ్గించింది.
*పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ దక్షిణ ప్రాంత ట్రాన్స్మిషన్ సిస్టమ్-1 (ఎస్‌ఆర్‌టీఎస్) ఛీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) గా అవినాష్ ఎం.పవ్గి పదవీ బాధ్యతలు చేపట్టారు.
*ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పావు శాతం మేర తగ్గించాయి.
*కొన్ని చిన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నియంత్రిత వాటా విక్రయించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
*సోతెబికు చెందిన ఆక్షన్హౌస్ను ఫ్రెంచి టెలికాం, మీడియా దిగ్గజం పాట్రిక్ ద్రాహి 3.7 బిలియన్ డాలర్ల (సుమారు రూ.26,000 కోట్ల)కు కొనుగోలు చేశారు.
*దేశంలో ఉద్యోగ సృష్టి విషయంలో ఐటీ-సాఫ్ట్వేర్ పరిశ్రమ అగ్రస్థానంలో కొనసాగుతోంది. మే నెలలోనూ తన హవాను ప్రదర్శించింది.
* కార్వీ గ్రూపులోని కార్వీ ప్రైవేట్ వెల్త్ సీఈఓ అభిజిత్ భావే, కార్వీ రియాల్టీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కార్వీ కేపిటల్‌కు చెందిన పలువురు ఉన్నతాధికార్లపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
*చాటింగ్‌లు, ఫొటోలు-వీడియోలు తిలకించేందుకు.. ఇతరులకు పంపేందుకు వినియోగిస్తోన్న ఫేస్బుక్లో, కొనుగోళ్లు, గేమింగ్కూ వీలు కలుగనుంది. ఇందుకోసం సరికొత్త క్రిప్టోకరెన్సీని సంస్థ ఆవిష్కరించనుంది. వచ్చే ఏడాది ఇది అందుబాటులోకి రానుంది.
*బయోటెక్ కంపెనీల విలీనాల్లో మరొకటి చోటు చేసుకుంది. తాజాగా అరే బయోఫార్మాను ఫైజర్ కొనుగోలు చేసింది.
*టాటా మోటార్స్ నుంచి ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ (ఏఎంటీ) వెర్షన్లో కాంపాక్ట్ సెడాన్ టిగోర్ కార్లు విపణిలోకి విడుదలయ్యాయి.
*జెట్ ఎయిర్వేస్ను జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ)కు పంపాలని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నేతృత్వంలోని బ్యాంకర్ల బృందం నిర్ణయించింది.
కార్వీపై కేసు-వాణిజ్య-06/18
Related tags :