Devotional

లేపాక్షి ప్రత్యేకత ఇదే

లేపాక్షి ప్రత్యేకత ఇదే-Have you ever been to lepakshi - Here is what you must know

1. లేపాక్షి ప్రత్యేకత ఇదే – ఆద్యాత్మిక వార్తలు
స్కాందపురాణం ప్రకారం మనదేశంలోని 108 శైవక్షేత్రాలలో అనంతపురం జిల్లా లేపాక్షిలో కొలువై ఉన్న శివుడికి పాపనాశేశ్వరుడని పేరు. ఈ క్షేత్రం శిల్పక కు పెట్టింది పేరు. ఆలయ స్తంభాలమీద విజయనగర రాజుల కాలంనాటిఅద్భుత శిల్ప కళానైపుణ్యం అడుగడుగునా కనిపిస్తుంది. లేపాక్షిలో యాత్రికులను కట్టిపడేసే మరొక అద్భుతం లేపాక్షి బసవన్న. దాదాపు 16 అడుగుల ఎత్తు, 27 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పుతో మెడలో చిరుమువ్వలు, కాళ్లకు గజ్జెల పట్టెడలతో, మూపున అలంకరించిన దుస్తులతో అత్యంత రమణీయంగా తీర్చిదిద్దిన నందీశ్వరుడి సజీవ శిల్పం చూస్తుంటే లేచివస్తాడేమో అనిపిస్తుంది.మెడచుట్టూ మూడురకాల పట్టెడలు, అన్నింటికంటె కింఇభాగాన 29 గంటలున్న పట్టెడ, దానిపైన 18 మువ్వలున్న పట్టెడ, ఆ పైన 27 రుద్రాక్షలున్న మాలతో అలంకరించి ఉన్న ఈ శిల్పం కాళ్లు, తోక పొట్టకిందుగా లోపలికి మడిచిపెట్టుకుని ప్రశాంత గంభీరంగా కనిపిస్తుంది. లేపాక్షి చుట్టుపక్కల ఎవరి పశువుకైనా జబ్బు చేస్తే వారు ఈ నంది విగ్రహం వద్దకు వచ్చి నూనెతో దీపాన్ని వెలిగించి మొక్కుకుని వెళతారు. వాళ్లు మొక్కుకున్న మరుసటిరోజే ఆ జబ్బు నయమవుతుందట. ఈ క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. లేపాక్షి నంది రంకె వేస్తే ప్రళయం వస్తుందని స్థలపురాణం చెబుతోంది.
2. దుర్గమ్మను దర్శించుకున్న కేసీఆర్
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి పిలిచేందుకు, విశాఖ శ్రీశారదా పీఠ ఉత్తరాధికారి శిష్య తురీయాశ్రమ స్వీకార మహోత్సవంలో పాల్గొనేందుకు సోమవారం ఆయన విజయవాడకు వచ్చారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, పంచాయతీరాజ్శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కేసీఆర్ వెంటరాగా.. దుర్గమ్మ ఆలయ ఈవో కోటేశ్వరమ్మ వారిని ఆలయ మర్యాదలతో ఆహ్వానించారు. వేద పండితులు ఆశీర్వచనం పలికారు. అనంతరం కేసీఆర్కు అమ్మవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. కేసీఆర్తో పాటు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ ఎంపీ సంతోష్కుమార్ తదితరులు వచ్చారు.
3. బెల్లం లడ్డూ ధర రూ. 25 -దేవాదాయ కమిషనర్ ఆదేశాలు జారీ
రాష్ట్రంలోని దేవాలయాల్లో బెల్లం లడ్డూ తయారీ, విక్రయాలపై సోమవారం దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాష్ట్రంలోని పెద్ద ఆలయాల నిర్వహకులు ఒకే ధర, ఒకే బరువు విధానాల అమలుకు సన్నద్ధమయ్యారు. 80 గ్రాముల లడ్డూను రూ.25కి విక్రయించాలని నిర్ణయించారు. యాదాద్రి, భద్రాద్రి, వేములవాడ, బాసర, ధర్మపురి, కొమురవెల్లి, చెర్వుగట్టు ఆలయాల్లో చక్కెరతోపాటు బెల్లంపాకంతో లడ్డూల తయారీపై కసరత్తులు మొదలయ్యాయి. 40 రోజులుగా బెల్లం లడ్డూ విక్రయాలను నామమాత్రంగా చేపట్టిన ఆలయాలలో ధర ఖరారు కానందున ఒక్కోచోట ఒక్కో ధరకు విక్రయించారు.అంతటా ఒకేవిధానం ఉండాలన్న యోచనతో చేపట్టిన కసరత్తుల్లో తెల్ల బెల్లం ధర చక్కెర కంటే అధికంగా ఉందని దీంతో వ్యయభారం పెరుగుతోందన్న వాదనలను ఆలయాల నిర్వాహకులు కమిషనర్ దృష్టికి తెచ్చారు. నివేదికల ఆధారంగా కమిషనర్ అరుణ్కుమార్.. మంత్రి ఇంద్రకరణ్రెడ్డితోనూ చర్చలు జరిపారు. ప్రస్తుతం 80 గ్రాముల లడ్డూను రూ.25కి విక్రయించాలని నిర్ణయిస్తూ ఆదేశించారు. కమిషనర్ ఆదేశాల మేరకు తయారీ తీరుతోపాటు విక్రయాలను కొనసాగిస్తామని యాదాద్రి ఈవో గీతారెడ్డి తెలిపారు.
4. జులై 14న దుర్గమ్మకు తెలంగాణ బోనాలు
భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో జులై 14వ తేదీన విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మకు బోనాలు సమర్పిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ మేరకు సోమవారం దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మను దేవస్థానంలో కలిసి లేఖ అందజేశారు. పదేళ్లుగా భారీ ఊరేగింపుతో వచ్చి పట్టువస్త్రాలు, పండ్లు, పసుపు, కుంకుమ, పూలతో దుర్గమ్మకు బంగారు బోనం సమర్పిస్తున్నామని కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస యాదవ్ లేఖలో వివరించారు. విస్తారంగా వర్షాలు కురిసి పాడి పంటలతో తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని దుర్గమ్మను కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
5. శారదాపీఠం ఉత్తరాధికారిగా స్వాత్మానందేంద్ర
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారిగా కిరణ్కుమార్శర్మ దీక్షాస్వీకార కార్యక్రమం కృష్ణా తీరంలో సోమవారం వైభవోపేతంగా జరిగింది. సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన కిరణ్కుమార్శర్మను శారదాపీఠ గురు పరంపరలో భాగంగా ఇకపై స్వాత్మానందేంద్ర సరస్వతీస్వామిగా వ్యవహరిస్తామని ప్రస్తుత పీఠాధిపతి స్వరూపానందేంద్ర ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కె.చంద్రశేఖర్రావు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. రాజధాని అమరావతిలో కృష్ణా తీరంలో గణపతి సచ్చిదానంద ఆశ్రమ ప్రాంగణంలో మూడు రోజులుగా జరుగుతున్న కిరణ్కుమార్శర్మ సన్యాసాశ్రమ స్వీకార మహోత్సవాలు సోమవారం ఆయనను పీఠానికి ఉత్తరాధికారిగా నియమించడంతో ముగిశాయి. ప్రస్తుత పీఠాధిపతి స్వరూపానందేంద్ర, పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్రల పాదాలకు ఇద్దరు ముఖ్యమంత్రులు నమస్కారం చేశారు. జగన్కు స్వరూపానందేంద్ర ప్రేమగా ముద్దు పెట్టి, అభిమానాన్ని చాటుకున్నారు.
6. శ్రీవారి సేవలో జస్టిస్ శేషసాయి
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేషసాయి దంపతులు సోమవారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు.
7. రమణీయం.. చాముండేశ్వరి కల్యాణం
భక్తుల జయజయ ధ్వానాలు.. వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ శ్రీ చాముండేశ్వరి సమేత శ్రీ మల్లేశ్వరస్వామి కల్యాణోత్సవం వైభవంగా సాగింది. జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన గంగపట్నం శ్రీ చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టమైన కల్యాణం సోమవారం వేకువజామున గం.4.30కు జరిగింది. మడనూరు మల్లికార్జునగురుకుల్, వేదపండితులు అనిల్శర్మ, సుధీర్శర్మ, రామకృష్ణస్వాముల ఆధ్వర్యంలో కల్యాణ ఘట్టాన్ని ప్రారంభించారు. ఆలయ ఛైర్మన్ పెనుబల్లి రామచంద్రనాయుడు, ఈవో గడ్డం రవీంద్రరెడ్డి తలంబ్రాల బియ్యం, పట్టువస్త్రాలను స్వామి, అమ్మవార్లకు సమర్పించారు. ఈ సందర్భంగా మల్లికార్జున గురుకుల్ లోక కల్యాణం కోసం ఆది దంపతులు కల్యాణం ఏటా ఏరువాక పౌర్ణమి రోజు జరుగుతుందన్నారు. స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవ సమయంలో పలు జంటలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అంతకుముందు పోతురాజు మందిరం వద్ద ఏరువాక పౌర్ణమి కార్యక్రమం ఘనంగా సాగింది. కల్యాణోత్సవం అనంతరం ఆలయం తలుపులను మూసివేసి స్వామి, అమ్మవార్లను గ్రామానికి ఊరేగింపుగా మేళతాళాలతో తీసుకొచ్చారు. భక్తులు దివిటీలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. భారీ సంఖ్యలో విచ్చేసిన భక్తులతో గ్రామంలోని వీధులన్నీ భక్తులతో కిటకిటలాడాయి.
8. జూలై 4 నుంచి గోల్కొండ బోనాలు
తెలంగాణ ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొనే అతిపెద్ద పండుగ బోనాలు. నెలరోజులపాటు అంగరంగ వైభవంగా సాగనున్న ఉత్సవాలు జూలై 4 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో అమావాస్య తర్వాత వచ్చే గురువారం గానీ, ఆదివారం గానీ బోనాలు ప్రారంభమవుతాయి. ఈ ఆషాడంలో అమావాస్య జూలై రెండున వస్తుండడంతో నాలుగున గురువారం నుంచి బోనాలు జాతర మొదలుకానుంది. చారిత్రక గోల్కొండ కోటపై గల శ్రీ జగదాంబిక(ఎల్లమ్మ) ఆలయంలో మొదటి పూజ జరిగిన తర్వాతే రాష్ట్రవ్యాప్తంగా బోనాలు ప్రారంభమవుతాయి. గోల్కొండ తర్వాత సికిద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి, లాల్దర్వాజ మహాకాళి బోనాలుంటాయి. ఆషాడం మాసం చివరి రోజున తిరిగి గోల్కొండ కోటలో చివరి బోనం పూజతో ఉత్సవాలు ముగుస్తాయి. గోల్కొండ ఎల్లమ్మకు తొలి బోజనం సమర్పించే ఆనవాయితీ కులీకుతుబ్షా కాలం నుంచి వస్తోంది. ఆనాటి నుంచే బోనాల ఉత్సవాలు ప్రభుత్వ హయాంలో జరుగుతున్నాయి. ఉత్సవాల కోసం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని శ్రీ జగదాంబిక ట్రస్టు బోర్డు ఏర్పాట్లు మొదలుపెట్టింది. జూలై 4 నుంచి నెలరోజులపాటు ప్రతి గురు, ఆదివారాల్లో బోనాల పండుగ అంగరంగ వైభవంగా సాగుతుంది. ఆ వారాల్లో తొమ్మిది ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పూజలకు నగరం నలుమూలల నుంచే గాక, రంగారెడ్డిజిల్లా, మహబూబ్నగర్, మెదక్, నల్లగొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిన తర్వాత వస్తున్న ఆరో బోనాలివి.
9. యాదాద్రీశునికి బంగారు హారం బహూకరణ
శ్రీలక్ష్మీనరసింహస్వామివారికి సికింద్రాబాద్కు చెందిన ఉప్పు మనోహర్ రేణుక దంపతులు రూ. 11 లక్షల విలువచేసే 336 గ్రాముల బంగారంతో తయారు చేసిన దశావతారాల హరాన్ని బహుకరించి తమ మొక్కును తీర్చుకున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త అయిన ఉప్పు మనోహర్ తన కోర్కెలు నెరవేరడంతో తమ మొక్కులను శ్రీలక్ష్మీనరసింహస్వామివారికి తీర్చుకున్నారు. యాదాద్రి ఆలయ ఈవో ఎన్. గీతకు హారాన్ని అందజేయగా ప్రధానార్చకులు నల్లంతీగల్ లక్ష్మీనరసింహాచార్యులు ఆధ్వర్యంలోని అర్చకబృందంతో సంప్రోక్షణ పూజలు నిర్వహించిన మీదట శ్రీవారికి సమర్పించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతు యాదాద్రిని సీఎం కేసీఆర్ రాష్ట్రంలోనే పేరెన్నికగన్న ఆలయంగా నిర్మాణం చేస్తున్న తరుణంలో శ్రీవారికి మొక్కులు తీర్చుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా అర్చకులు మనోహర్ కుటుంబసభ్యులకు ప్రత్యేక దర్శనం కలిగించిన మీదట ఆశీర్వచనం జరిపి శ్రీవారి ప్రసాదం అందజేశారు.
10. చరిత్రలో ఈ రోజు/జూన్ 18
వేదం వేంకటరాయ శాస్త్రి పితృ దినోత్సవం (ఫాదర్స్ డే)
1868 : ప్రముఖ రష్యన్ రచయిత మాక్సిం గోర్కీ జననం (మ.1936).
1929 : సుప్రసిద్ధ పండితుడు, కవి మరియు విమర్శకుడు వేదం వేంకటరాయ శాస్త్రి మరణం(జ.1853).
1953 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు పాలకోడేటి శ్యామలాంబ మరణం (జ.1902).
1983 : ప్రపంచకప్ క్రికెట్ ‌లో కపిల్ దేవ్ జింబాబ్వే పై 175 పరుగులు సాధించి ఒక రోజు క్రికెట్‌లో భారత్ తరఫున తొలి శతకాన్ని నమోదుచేశాడు.
1986 : ప్రముఖ సాహితీవేత్త, పరిశోధకుడు ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం మరణం (జ.1908).
2006 : మొదటి కజక్ దేశపు ఉపగ్రహం ‘కజ్ శాట్’ ప్రయోగించారు.
11. శుభమస్తు తేది : 18, జూన్ 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్ఠమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : మంగళవారం
క్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : పాడ్యమి
న్న మద్యాహ్నం 2 గం॥ 5 ని॥ నుంచి
ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 34 ని॥ వరకు)
నక్షత్రం : మూల
(నిన్న ఉదయం 10 గం॥ 47 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 11 గం॥ 53 ని॥ వరకు)
యోగము : శుక్లము
కరణం : కౌలవ
ర్జ్యం : (ఈరోజు ఉదయం 10 గం॥ 12 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 52 ని॥ వరకు)(ఈరోజు రాత్రి 10 గం॥ 9 ని॥ నుంచి ఈరోజు రాత్రి 11 గం॥ 51 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 11 ని॥ నుంచి ఈరోజు ఉదయం 6 గం॥ 51 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 19 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 11 ని॥ వరకు)(ఈరోజు ఉదయం 10 గం॥ 2 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 54 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 33 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 11 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 12 గం॥ 16 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 54 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 8 గం॥ 59 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 37 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 42 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 51 ని॥ లకు
సూర్యరాశి : మిథునము
చంద్రరాశి : ధనుస్సు