దాదాపు ఏడాది పూర్తి కావొచ్చింది ‘రేస్ 3’ సినిమా విడుదలై. ఒక్క జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తప్ప ఈ సినిమాలో నటించిన హీరో హీరోయిన్లంతా తమ తర్వాతి చిత్రాలపై ఫోకస్ పెట్టారు. ఈ బ్యూటీ తర్వాతి సినిమాపై ఇంకా ఎందుకు క్లారిటీ రాలేదబ్బా? అని బీటౌన్‌లో ఎంక్వైరీ చేసిన వారికి ‘ఆమె యాక్టింగ్ క్లాసులకు వెళుతోందని, అది కూడా లాస్ ఏంజిల్స్‌లోని ఇవనా చుబ్బుక్ స్టూడియోలో’ అని తెలిసింది. చార్లైజ్ త్రోన్, బ్రాడ్‌పిట్, జేమ్స్ ఫ్రాంకో వంటి హాలీవుడ్ స్టార్లు ఈ స్టూడియోలోనే యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చిన పదేళ్ల తర్వాత యాక్టింగ్ క్లాసులు ఏంటి? అని జాక్వెలిన్‌ని అడిగితే.. ‘‘దశాబ్దకాలంగా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్నాను.నా కెరీర్ తొలినాళ్లలో సినిమాల గురించి అర్థం చేసుకోవడానికి నాకు టైమ్ పట్టింది. కానీ నేనెప్పుడూ యాక్టింగ్ క్లాసులు తీసుకోలేదు. ఇప్పుడు తీసుకుంటున్నాను. ట్రైనింగ్ బాగుంది. నా కెరీర్‌లో ఇప్పటివరకు ఎక్కువగా కమర్షియల్ సినిమాలే చేశాను. ఇప్పుడు ప్రయోగాత్మక సినిమాలు చేయాలనుకుంటున్నాను. కమర్షియల్, ఎక్స్‌పరిమెంట్ .. ఇలా రెండు జానర్‌లను బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు చేయాల్సిన టైమ్ వచ్చిందని తెలిసింది. అందుకే ట్రైనింగ్ తీసుకుంటున్నాను’’ అన్నారు. తాను నటించిన ‘డ్రైవ్’ గురించి మాట్లాడుతూ – ‘‘నేను, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన ఈ సినిమా విడుదల ఆగిపోలేదు. త్వరలోనే ఆడియన్స్ థియేటర్స్‌లో చూస్తారు’ అని చెప్పుకొచ్చారు జాక్వెలిన్.
సమయం వచ్చేసింది
Related tags :