వ్యాయామం చేయాలని మనలో చాలామంది అనుకున్నా… బద్ధకం ఓ పట్టాన చేయనివ్వదు. దాన్ని వదిలించుకునేందుకు మార్గాలు ఇవి. రోజూ ఆరింటికి నిద్రలేచే అలవాటు మీకు ఉంటే… ఇకపై పదిహేను నిమిషాల ముందే మేల్కొనండి. ఆ సమయంలో స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయండి. ఇది శరీరాన్ని వ్యాయామానికి సిద్ధం చేస్తుంది. బద్ధకమూ వదులుతుంది.
* ఈ రోజుల్లో ఒక్క క్లిక్ కొడితే చాలు… కూరగాయలు మొదలు అన్నిరకాలూ మన ఇంటిముందుకే వచ్చేస్తాయి. అన్నీ కాకపోయినా కొన్నింటినైనా మీరు స్వయంగా వెళ్లి కొనుక్కోవడానికి ప్రయత్నించండి. నడవడం వల్ల శరీరానికి ఎంతోకొంత వ్యాయామం అందుతుంది. రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకోకుండా ఆరుబయట కనీసం పావుగంట నడవడం అలవాటు చేసుకోండి. కొవ్వు పేరుకోకుండా ఉంటుంది.
* బయటకు వెళ్లి వ్యాయామం చేయడం కష్టం అనుకునేవారు ఇంట్లోనే రకరకాల వ్యాయామాలు చేయొచ్చు. దానికి సంబంధించిన వీడియోలు యూట్యూబ్‌లో బోలెడు ఉంటాయి. రకరకాల యాప్‌లు ఉన్నాయి.
వ్యాయామానికి బద్ధ శత్రువు-బద్దకం
Related tags :