*ఓల్డ్ త్రాఫార్ వేదికగా గత ఆదివారం పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ రికార్డు సెంచరీతో భారత్ భారీ విజయాన్ని నలోడు చేసుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇన్నింగ్స్ లో హసన్ అలీ బౌలింగ్ లో రిఒహిట్ శర్మ కొట్టిన సిక్స్ ను చాలా మంది భారత అభిమానులు 2003 వరల్డ్ కప్ లో షోయాబ్ అక్తర్ బౌలింగ్ లో సచిన్ కొట్టిన సిక్స్ తో పోల్చడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
*సోమవారం రాత్రి రెండు భారీ భూకంపాలు చైనాను కుదిపేశాయి. నైరుతి ప్రావిన్స్‌లోని సిచువాన్‌లో అరగంట తేడాతో సంభవించిన భూకంపాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 122 మంది తీవ్రంగా గాయపడ్డారు.
*మాజీ ఎంపీ లు వి.హనుమంతారావ్,అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ లను అరెస్ట్ చేసిన పంజాగుట్ట పోలీసులుఉదయం 5 గంటలకు పంజాగుట్ట వద్ద అంబేత్కర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించిన వి.హెచ్, హర్షకుమార్ లారీ లో అంబేత్కర్ విగ్రహాన్ని తీసుకు రాగా లారీ తో సహా విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులువిహెచ్, హర్షకుమార్ లతో పాటు కార్యకర్తలను అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు.
*మరో మూడు నెలల్లో రాష్ట్రంలో అమల్లోకి రానున్న కొత్త ఆబ్కారీ విధానంపై అధికారుల కసరత్తు చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న మందు గదులను (పర్మిట్ రూంలు) ఎత్తివేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
*రెవెన్యూ శాఖ ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నాయి. జూనియర్ అసిస్టెంట్ నుంచి తహసీల్దారు స్థానం వరకు వారు పనిచేసిన, పనిచేస్తున్న, సీనియారిటీతో పాటు పూర్తి వివరాలు తెలపాలంటూ భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయం సోమవారం అత్యవసర ఆదేశాలు జారీచేసింది.
*దేశంలో ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల వ్యయం రూ.55 వేల కోట్ల నుంచి 60 వేల కోట్ల రూపాయలు దాటిందని, ప్రపంచంలోనే ఇంతగా భారీ స్థాయిలో ఖర్చు ఎక్కడా జరగలేదని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ (సీఎంఎస్) వెల్లడించింది.
*పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్ల (జూడాల) నిరసనకు మద్దతుగా సోమవారం దేశవ్యాప్తంగా వైద్యులు విధులను బహిష్కరించారు. వైద్యులపై దాడులను ఖండిస్తూ, వివిధ రూపాల్లో ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అత్యవసరేతర వైద్య సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది.
*విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న అనంతరం కేసీఆర్ రోడ్డు మార్గాన తాడేపల్లిలోని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యలో ప్రకాశం బ్యారేజీపై కారును ఆపించి కిందకు దిగి.. బ్యారేజీని, నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం కృష్ణమ్మకు నమస్కరించారు.
*సిద్దిపేట జిల్లా ములుగు మండలం మామిడ్యాల గ్రామంలోని కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా పరిహారం అందని నిర్వాసితులకు (31 మంది) చట్టప్రకారం రావాల్సిన సొమ్ముకు చెక్కులను సిద్ధం చేసుకొని కోర్టుకు తీసుకురావాలంటూ ప్రభుత్వానికి సోమవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
*ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో తెరాసకు ఎదురైన ఫలితాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు.. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు అసంపూర్తిగా ఉన్నప్పటికీ మసిపూసి మారేడుకాయ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆరోపించారు.
*దేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా హైదరాబాద్లో ఆగస్టు 7న జాతీయ ఓబీసీ మహాసభలను నిర్వహిస్తామని జాతీయ ఓబీసీ మహాసభల నిర్వహణ కమిటీ ఛైర్మన్ జాజుల శ్రీనివాస్గౌడ్ తెలిపారు. సోమవారం నగరంలోని దోమలగూడ బీసీ భవన్లో సంఘం నాయకులు జాతీయ కమిటీ ఛైర్మన్గా ఎన్నికైనందుకు ఆయనను సన్మానించారు.
*తెలంగాణ కల్పతరవు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నెల 21న ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారుకాగా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనులను పర్యవేక్షిస్తున్నారు.
*ఈ నెలాఖరులో ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఈమేరకు సాంకేతిక విద్యాశాఖ కాలపట్టికను సైతం సిద్ధం చేసింది. ఈ నెల 20వ తేదీన విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ జనార్దన్రెడ్డి వద్ద చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
*తెలుగు సాహిత్యంలో వెలువడిన ఉత్తమ గ్రంథాలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2017 సంవత్సరానికి సాహితీ పురస్కారాలను ప్రకటించింది. పద్యకవితా ప్రక్రియలో మాల్యశ్రీ (చింతలూరి మల్లయ్య) రచించిన ‘మన్యభారతం’, వచనా కవితలో నారాయణ స్వామి రచన ‘వానొస్తద..?’, గేయ కవిత్వంలో తుమ్మూరి రామమోహన్రావు రచన ‘ఎలకోయిల పాట’ సాహితీ పురస్కారాలకు ఎంపికయ్యాయి.
*ఎట్టకేలకు రాష్ట్రంలో భారీ వర్షాలు పడటం మొదలైంది. ఈ వర్షాకాలం సీజన్లో తొలిసారి సోమవారం ఖమ్మం జిల్లా కొణిజర్లలో 80 మిల్లీమీటర్లు(మి.మీ.), పంగిడిలో 79.3 మి.మీ.ల వర్షం కురిసింది. ఈ స్థాయి వర్షాలు పడటం ఈ నెలలో ఇదే ప్రథమం. సోమవారం ఉదయం 8.30 నుంచి రాత్రి వరకు మొత్తం 165 ప్రాంతాల్లో వర్షాలు పడినట్లు రాష్ట్ర ప్రణాళికాభివృద్ధి సొసైటీ ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు ఈ నెల 22నాటికి రాష్ట్రంలో ప్రవేశిస్తాయని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు.
* ప్రజలకు నాణ్యమైన పాల ఉత్పత్తులు అందించాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా 200 సంచార విక్రయ కేంద్రాలు వచ్చే నెల మొదటి వారంలోగా ప్రారంభించాలని నిర్ణయించినట్లు విజయ డెయిరీ ఛైర్మన్ లోక భూమారెడ్డి చెప్పారు. హైదరాబాద్లో 100, మిగతా ప్రాంతాల్లో మరో 100 ఏర్పాటు చేస్తామన్నారు.
*శాసనసభ ఉప సభాపతి పదవికి వైకాపా ఎమ్మెల్యే కోన రఘుపతి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన్ను ప్రతిపాదిస్తూ ఆ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. సోమవారం సాయంత్రం వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది.
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2019-20 ఆర్థిక సంవత్సరం పూర్తి స్థాయి బడ్జెట్ రూపకల్పనకు కసరత్తు సాగుతోంది. జులై రెండో వారంలో రాష్ట్ర శాసనసభలో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఆస్కారం ఉందని తెలిసింది. ప్రస్తుత సమాచారం ప్రకారం జులై 10న శాసనసభకు బడ్జెట్ సమర్పించే అవకాశం ఉంది.
*నైరుతి రుతుపవనాలు ఈ నెల 21వ తేదీన మహారాష్ర్టకు రానున్నాయని.. జూన్ 24 లేదా 25లోపు రాష్ట్రమంతటా విస్తారమైన వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.
ఐసీసీకి సచిన్ కౌంటర్-తాజావార్తలు–06/18
Related tags :