బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన జిమ్ వీడియోతో నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేశారు. తన ఇద్దరు బాడీగార్డులను లెగ్ మెషిన్‌పై కూర్చోబెట్టి వ్యాయామం చేశారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను సల్లూభాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘సంతోషం, బాధల్ని దాటిన తర్వాత నా సెక్యూరిటీ చివరికి నాతో తామెంత జాగ్రత్తగా ఉన్నామనే విషయాన్ని అర్థం చేసుకున్నారు. హ హ..’ అని పోస్ట్ చేశారు. సల్మాన్ మెషిన్ బరువును మాత్రమే కాకుండా బాడీగార్డుల బరువు కూడా కాళ్లతో లిఫ్ చేయడంతో నెటిజన్లు షాక్ అయ్యారు. వీడియోకు తెగ కామెంట్లు చేశారు. ‘భాయ్ నీకు సాటిలేరు, వావ్, జాగ్రత్త..’ అంటూ పోస్ట్‌లు చేశారు. ఈ వీడియోను 13 గంటల్లో దాదాపు 27 లక్షల మందికిపైగా వీక్షించారు. 10.5 వేల మంది లైక్ చేశారు. సల్మాన్ ఇటీవల ‘భారత్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కత్రినా కైఫ్, దిశా పటానీ కథానాయికలుగా నటించారు. రంజాన్ సందర్భంగా విడుదలైన ఈ చిత్రం కేవలం ఏడు రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.167.60 కోట్లు రాబట్టింది. తొలిరోజున రూ.42.30 కోట్లు రాబట్టి రికార్డు సృష్టించింది. ఈ సినిమా విజయం తర్వాత సల్మాన్ చిన్న విరామం తీసుకున్నారు. కుటుంబంతో కలిసి విలువైన సమయాన్ని గడుపుతున్నారు. మరోపక్క ఆయన హీరోగా ‘దబాంగ్ 3’ సినిమా తెరకెక్కుతోంది. ప్రభుదేవా దర్శకుడు.
View this post on Instagram