Sports

నేను వారికోసం పనిచేయట్లేదు

Sania Mirza Slams Actress Saying She Is Not Pakistan Teams Dietician

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా .. పాకిస్థాన్ టీమ్‌తో క‌లిసి మాంచెస్ట‌ర్‌లో సీసా బార్‌కు వెళ్లింది. దీన్ని త‌ప్పుప‌డుతూ పాక్ న‌టి వీణా మాలిక్ ఓ ట్వీట్ చేసింది. సోష‌ల్ మీడియాలో ఆ వీడియో వైర‌ల్ అయ్యింది. ఇండియాతో మ్యాచ్‌కు ముందు రోజు పాక్ జ‌ట్టు ఓ హోట‌ల్‌కు వెళ్లింది. అయితే షోయెబ్ మాలిక్‌తో క‌లిసి సానియా కూడా ఆ హోట‌ల్‌కు వెళ్లిన‌ట్లు వీడియోలో ఉంది. సానియా.. నీ కుమారుడి గురించి ఆందోళ‌న‌గా ఉన్న‌ది, ఆ చిన్నారిని షీసాకు తీసుకువెళ్ల‌డం మంచిది కాదు అని వీణా మాలిక్ ఓ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌కు సానియా మీర్జా కౌంట‌ర్ ఇచ్చింది. త‌న కుమారున్ని షీసా బార్‌కు తీసుకువెళ్ల‌లేద‌ని చెప్పింది. కుమారుడిని ఎలా చూసుకోవాలో త‌న‌కు తెలుసు అని సానియా ట్వీట్ చేసింది. షీసాలో ఉండే జంక్ ఫుడ్ అథ్లెట్ల‌కు మంచిది కాదు అని వీణా మ‌రో ట్వీట్ చేసింది. అయితే తానేమీ పాక్ క్రికెట్ జ‌ట్టుకు డైటీషియ‌న్‌ను కాదు అని, ఆ ఆట‌గాళ్ల‌కు మాతృమూర్తిని కాదు, ప్రిన్సిప‌ల్‌ను కాదు అని మ‌రో ట్వీట్‌లో సానియా స‌మాధానం ఇచ్చింది. చివ‌ర‌గా వీణా చూపించిన శ్ర‌ద్ధ‌కు సానియా కంగ్రాట్స్ చెప్పింది.