తెలంగాణ రాష్ట్రం ఈ వేసవిలో బీర్ల విక్రయాల్లో రికార్డు సృష్టించింది. హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ జిల్లాల్లో వేసవి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడంతో బీర్ల విక్రయాల జోరు పెరిగింది. తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒక్క మే నెలలోనే అత్యధికంగా 61 కేస్ ల బీర్లను విక్రయించింది. ఏప్రిల్ నెలలో 57 కేస్ ల బీరును విక్రయించింది. గత ఏడాది మే నెలలో 57 కేస్ ల బీర్లను విక్రయించగా, ఈ సారి 61 లక్షల కేస్ లకు పెరిగింది. మెదక్ జిల్లాతోపాటు పలు ప్రాంతాల్లో భూగర్భజలాలు పడిపోవడంతో బీరు ఉత్పత్తికి మంచినీటిని సరఫరా చేయవద్దని పలు జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో బీరు ఉత్పత్తి తగ్గిపోయింది. దీనివల్ల మద్యం దుకాణాలకు 30 శాతం బీర్ల సరఫరా తగ్గిందని తెలంగాణ వైన్ డీలర్ల సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు చెప్పారు. ఉత్పత్తితోపాటు సరఫరా తగ్గడంతో బీర్ల కొరత ఏర్పడింది. మద్యం దుకాణాల్లో బీర్ల కొరతతో మందుబాబులు గొడవలకు దిగుతున్నారు.
నీరు కన్నా బీరును ప్రేమిస్తున్న తెలంగాణా ప్రజలు
Related tags :