అడాగ్ గ్రూపు అధినేత అనిల్ అంబానీ సంపద రోజురోజుకీ తరిగిపోతోంది. తాజాగా ఆయన బిలియనీర్ క్లబ్ నుంచి కిందికి పడిపోయారు. 2008 సంవత్సరంలో అత్యంత సంపన్నుడిగా(42 బిలియన్ డాలర్లు) ప్రపంచంలో ఆరో స్థానంలో ఉన్న ఆయన ర్యాంక్ ఇప్పుడు పడిపోయింది. పదకొండేళ్లలో అంబానీ మొత్తం వ్యాపార సామ్రాజ్యం మార్కెట్ విలువ రూ.3,651 కోట్లకు (523 మిలియన్ డాలర్లు) కుప్పకూలింది. అప్పుల సంక్షోభం, టెలికాం సంస్థ ఆర్కాంతోపాటు ఇతర గ్రూపుసంస్థల వరుస నష్టాల నేపథ్యంలో అంబానీ సామ్రాజ్యం కుప్పకూలింది.ఆయన మొత్తం సంపద 42 బిలియన్ డాలర్లనుంచి 0.5 బిలియన్ డార్లకు పడిపోయింది. ముఖ్యంగా మ్యూచుఫల్ ఫండ్ జాయింట్ వెంచర్ రిలయన్స్ నిప్సాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్‌లో బ్యాంకులు 43 శాతం వాటాలను విక్రయించడం కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి. గత గత 14 నెలల్లో రూ.35 వేల కోట్లకు పైగా రుణాలు తీర్చామని ఇటీవల అనిల్ అంబానీ ప్రకటించారు. ఆస్తులను అమ్మిఅయినా మొత్త రుణాలను తీరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. అయితే రుణాలను తీర్చేందుకు ప్రధాన ఆస్తులు వ్యాపారాల అమ్మకంతో అనిల్ అంబానీ సంపద బాగా క్షీణిస్తూ వస్తోంది. రిలయన్స్ గ్రూప్ విలువ నాలుగు నెలల క్రితం రూ.8వేల కోట్లకు పైగా ఉండగా ఇప్పుడు రూ.3,651 కోట్లకు చేరింది.
బిలియన్లు పోయి మిలియన్లు మాత్రమే మిగిలాయి

Related tags :