స్మార్ట్ అసిస్టెంట్‌లు రోజువారీ జీవితాల్లో తమదైన ముద్ర వేస్తున్నాయి. ఏ అవసరం వచ్చినా.. పిలిస్తే చిత్తం అంటూ అడిగింది చేసి పెట్టేస్తున్నాయి. అయితే వీటితో చిత్రమైన సమస్యలు కూడా ఎదురవుతున్నాయి… ఓ ఇంట్లో తల్లి, బిడ్డ తప్ప ఎవరూ లేరు. తల్లి రోజులో అనేక సార్లు అలెక్సా.. అలెక్సా.. అని పిలిస్తూ మాట్లాడుతోంది. అదంతా గమనిస్తున్న నెలల వయసున్న బిడ్డ తల్లి తనతోనే మాట్లాడుతోంది అనుకుంది. అలెక్సా.. అని తననే పిలుస్తోందని భావించింది. దీంతో తల్లి ఎప్పుడు అలెక్సా అని పిలిచినా తల తిప్పి చూస్తోంది. స్పందిస్తోంది. ఎంతెలా అంటే.. తన పేరే అలెక్సా అనుకుంది. చివరికి తనకు పెట్టిన పేరుతో పిలిస్తే స్పందించని స్థితికీ చేరుకుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇంట్లో వాయిస్ అసిస్టెంట్‌ల వాడకం ఏ స్థాయిలో ఉందో ఈ సంఘటన అద్దం పడుతోంది.
పురిటి బిడ్డ అలెక్సా పేరు పెట్టేసుకుంది
Related tags :