ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం మాంచెస్టర్ వేదికగా జరిగిన దాయాదుల పోరులో పాకిస్థాన్ జట్టు డక్‌వర్త్‌లూయిస్ పద్ధతిలో 89 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ జట్టుపై ఇంటా బయటా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్‌కు ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. పాకిస్థాన్‌కు చెందిన ఓ మీడియా సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. పాక్ చీఫ్ సెలెక్టర్ ఇషాన్ మనీ మంగళవారం సర్ఫరాజ్‌కి ఫోన్ చేసి మాట్లాడారని పేర్కొంది. భారత్‌తో ఓటమికి చింతించకుండా తదుపరి జరగబోయే నాలుగు మ్యాచ్‌లపై దృష్టిసారించాలని మనీ చెప్పారు. ఈ సందర్భంగా దేశం మొత్తం పాక్ జట్టుకు అండగా ఉందని, మీడియాలో ప్రసారమయ్యే వార్తల గురించి పట్టించుకోకుండా ఆట మీద ధ్యాస పెట్టాలని ఆయన సూచించారు. పాకిస్థాన్ ఇంకా సెమీస్ చేరే అవకాశాలు ఉన్నందున అనవసర విషయాలపై స్పందించకుండా జట్టుని ముందుండి నడిపించాలని కోరాడు. ఇదిలా ఉండగా పాక్ ఆటగాళ్ల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్‌అక్తర్ సైతం తన యూట్యూబ్ ఛానెల్‌లో పాకిస్థాన్ ఆటగాళ్ల తప్పుల్ని ఎండగట్టాడు. కెప్టెన్‌తో సహా ఎవరెవరు ఏయే తప్పులు చేశారో ఆ వీడియోలో వివరించాడు.
ఆట మీద ధ్యాస పెట్టు-పీసీబీ సలహా
Related tags :