వ్యక్తిగత భద్రతకు సంబంధించిన షాంపూలు, లోషన్, గోళ్ల రంగులు, వంటివి పిల్లల ఆరోగ్యానికి హాని కలుగచేస్తాయని, వాటి రసాయనాలు వికటించి అవి విషపూరితమై ప్రతి రెండు గంటలకు ఒకరిని ఆస్పత్రికి పంపిస్తాయ ని అమెరికాలో అధ్యయనం వెల్లడించింది. నేషనల్ వైడ్ చి ల్డ్రన్ ఆస్పత్రికి చెందిన పరిశోధకులు ఐదేళ్లకు మించిన పి ల్లలు మొత్తం 64,686 మంది వ్యక్తిగత భద్రత సాధనాల ఫలితంగా గాయాల పాలై 2002 నుంచి 2016 వరకు అమెరికా ఎమర్జెన్సీ విభాగాల్లో అత్యవసర వైద్యచికిత్స పొందినట్టు బయటపడింది. ఈ సాధనాలను పిల్లలు మింగడం, లేదా వాటి రసాయనాలు చర్మానికి తగిలి గాయాలు పాలవ్వడం తదితర కారణాల వల్ల ఆస్పత్రి పాలు కావలసి వచ్చింది.మింగడం వల్ల 75.7 శాతం, రసాయనాలు చర్మానికి తగిలి 19.3 శాతం పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. ఈ వయస్సు పిల్లలు ఆ సాధనాలపై ఏం రాసి ఉందో చదవలేరు. అందంగా బాటిల్ కనిపించినా లేదా పరిమళం బాగుందని అనిపించినా బాటిల్ తెరిచి అందులోని పదార్థాన్ని తాగడానికి,తినడానికి సిద్ధపడతారని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ విధంగా పిల్లలను గాయపరిచిన కేటగిరీల్లో మొదటి కేటగిరి 28.3 శాతం కేర్ ప్రోడక్టు, 27 శాతం హెయిర్ కేర్ ప్రోడక్టు,25 శాతం స్కిన్‌కేర్ ప్రోడక్టు, 12.7 శాతం పరిమళాల ప్రోడక్టు ఉన్నాయి. గాయాల పాలై ఎక్కువగా ఆస్పత్రి పాలు చేసిన వాటిలో, సగానికి సగం. 52.4 శాతం హెయిర్ ప్రోడక్టు వల్లనే అని తేలింది.
షాంపూలు, లోషన్లు పిల్లల ఆరోగ్యానికి హానికరం
Related tags :