2010 నుంచి 2017 మధ్యకాలంలో అమెరికాలో నివసిస్తోన్న ప్రవాస భారతీయుల సంఖ్య 38 శాతం పెరిగిందని సౌత్ ఏషియన్ అడ్వొకసీ గ్రూప్ తన నివేదికలో వెల్లడించింది. వివిధ వర్గాలకు చెందిన ప్రవాస భారతీయుల జనాభా 2010లో 31,83,063 మంది ఉండగా, 2017లో ఆ సంఖ్య 38 శాతం పెరిగి 44,02,363కి చేరిందని సౌత్ ఏషియన్ అమెరికన్స్ లీడింగ్ టుగెదర్ (సాల్ట్) వివరించింది. అలాగే 6,30,000 మంది అనధికారికంగా నివసిస్తుండగా, 2010 నుంచి అది 72 శాతానికి చేరుకుందని పేర్కొంది.2016లో వీసా పరిమితి ముగిసిన తరవాత కూడా సుమారు 2,50,000 మంది యూఎస్లో అనధికారికంగా నివసిస్తున్నారని తెలిపింది. దక్షిణాసియా మూలాలు కలిగిన వారు 2010లో 3.5 మిలియన్ల మంది ఉండగా, 2017లో ఆ సంఖ్య 40 శాతం పెరిగి 5.4 మిలియన్లకు చేరిందని సాల్ట్ వెల్లడించింది. అమెరికన్ కమ్యునిటీ సర్వే ఆధారంగా సాల్ట్ ఈ నివేదికను తయారు చేసింది. దీని ప్రకారం ఆసియాకు చెందిన అమెరికన్లలో ఆదాయ అసమానతలు ఎక్కువేనని, దక్షిణాసియాకు చెందిన 5 మిలియన్ల జనాభాలో సుమారు 10 శాతం(4,72,000) మంది దారిద్ర్యంలో జీవిస్తున్నారని తెలిపింది. అలాగే అమెరికాలో నివసించడానికి ఆశ్రయం కోరే దక్షిణాసియాకు చెందిన వారి సంఖ్య పెరుగుతుందని పేర్కొంది.97 నుంచి 1.7 మిలియన్ హెచ్-బీ వీసాదారుల భాగస్వాములకు హెచ్-4 వీసాలు దక్కాయని సాల్ట్ వెల్లడించింది. 2017లో 1,36,000 వ్యక్తులకు హెచ్-4 వీసాలు దక్కగా..వారిలో దాదాపు 86 శాతం మంది దక్షిణాసియా దేశాలకు చెందిన వారే. ఇదిలా ఉండగా, 2020లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో దక్షిణాసియా వాసులు కీలక పాత్ర పోషించనున్నారని తెలిపింది. గత పదేళ్ల కాలంలో ఓటు వేసే ఆసియన్ అమెరికన్ల సంఖ్య రెట్టింపైనట్లు కరెంట్ పాపులేషన్ సర్వే ద్వారా వెల్లడవుతోంది.
అమెరికాలో ఆకలితో అలమటిస్తోన్న దక్షిణాసియా వాసులు
Related tags :