చర్మం మీద ముడతలు నివారించడానికి… ఖరీదైన క్రీమ్‌లు, లేజర్ ట్రీట్‌మెంట్లు అవసరం లేదు. సమస్య మొదట్లో ఉంటే గనుక ఈ పూతలు ప్రయత్నించి చూడండి. సమస్య అదుపులో ఉండటంతోపాటూ చర్మం కూడా తాజాగా మారుతుంది. ఓ గుడ్డు తెల్లసొనలో కొద్దిగా నిమ్మరసం, చెంచా తేనె కలపాలి. దీన్ని ముఖం, మెడకు పూతలా పట్టించి, ఇరవ్కె నిమిషాల తరవాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. గుడ్డులోని ప్రొటీన్లు చర్మం బిగుతుగా మారేలా చేస్తే.. నిమ్మరసం కొలాజిన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఇక తేనె చర్మానికి తేమనందిస్తుంది. మొత్తంగా ముఖం ఆరోగ్యంగా కనిపిస్తుంది. దీన్ని రెండురోజులకోసారి వేసుకోవచ్చు. ఎనిమిది బాదం గింజలు తీసుకుని ముందురోజు రాత్రే నానబెట్టుకోవాలి. మర్నాడు పచ్చిపాలు పోసుకుంటూ మెత్తని ముద్దలా చేసుకోవాలి. దీన్ని ముఖానికి పూతలా వేసి అరగంట తరవాత చల్లని నీళ్లతో కడిగేయాలి. ఇలా వారంలో రెండుమూడుసార్లు చేస్తుంటే ముడతలు పెరగకుండా ఉంటాయి. బాదంలో ‘విటమిన్ ఈ’ తోపాటూ యాంటీఆక్సి డెంట్లు ఉంటాయి. ఈ పోషకాలు చర్మాన్ని బిగుతుగా మారుస్తాయి. ఇక, పచ్చిపాలు చర్మానికి తేమనందిస్తాయి. నల్లమచ్చలున్నా తగ్గుతాయి. బాగా మగ్గిన అరటిపండును తీసుకుని గుజ్జులా చేసుకోవాలి. అందులో పెద్ద చెంచా పెరుగూ, కొద్దిగా తేనె వేసుకుని కలపాలి. దీన్ని కొద్దిగా వేడిచేసి ఆ తరవాత ముఖం, మెడకూ పూతలా వేసుకోవాలి. ఇరవ్కె నిమిషాల తరవాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. అరటిపండులో ఉండే పోషకాలు కొలాజిన్ ఉత్పత్తికి తోడ్పడతాయి. అలాగే ముడతల్నీ నివారిస్తాయి. తేనె, పెరుగు చర్మానికి తేమతోపాటూ తాజాదనాన్ని అందిస్తాయి
ముడతల చర్మానికి నిగారింపు
Related tags :