తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మహోజ్వల ఘట్టం ఆవిష్కృతమైంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జాతికి అంకితం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 20 జిల్లాల్లోని 37 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలను కాళేశ్వరం తీర్చనుంది.ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ ఎత్తిపోతల పథకం నిర్మితమైన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక ఇంజనీరింగ్ అద్బుతం. దీని నిర్మాణంలో ఎన్నో విశేషాలున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో 199 కిలోమీటర్ల మేర నదీ జలాలు ఏడాది పొడవునా నిల్వ ఉంటాయి.ప్రాజెక్టులో భాగంగా వంద మీటర్ల లోతులో ఉండే గోదావరి నుండి 618 మీటర్ల ఎత్తుకు ఆరు దశల్లో నీటిని ఎత్తిపోస్తారు.ఈ స్థాయిలో నీటిని ఎత్తిపోసేందుకు భారీ మోటార్ పంపులను విదేశాల నుండి తెప్పించారు.ఇక ఈ ప్రాజెక్ట్‌లో నిర్మించిన నీటిని తీసుకుకపోవడానికి గ్రావిటీ కాలువల నిర్మాణం ఒక రికార్డు.. వీటి మొత్తం పొడవు 1,531 కిలోమీటర్లు. కాళేశ్వరం ప్రాజెక్ట్ భూగర్భంలో 330 మీటర్ల లోతులో 203 కిలోమీటర్ల పొడవైన సొరంగాలను నిర్మించారు.అలాగే ఈ భూగర్భంలో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినా సొరంగాలను దాటాలంటే కనీసం 4 గంటల సమయంలో పడుతుంది. ఇక ఈ ప్రాజెక్ట్‌లోని 8వ ప్యాకేజీలో నిర్మితవుతున్న లక్ష్మీపూర్ పంప్ హౌస్.. ఒక్కో మోటారు 139 మెగావాట్ల సామర్ధ్యం కలది.మొత్తం ఏడు మోటార్ల ద్వారా రోజుకు ఇవి 21 వేల క్యూసెక్కుల నీటిని తోడిపోస్తాయి. వేలాది మంది కార్మికులు, ఇంజనీరింగ్ నిపుణులు రాత్రంబవళ్లు కష్టపడి అతి తక్కువ సమయంలోనే దీనిని పూర్తి చేశారు.నీటిని సరఫరా చేసే మార్గం పొడవు- 1,832 కి.మీగ్రావిటీ ప్రెషర్ కాలువ పొడవు -1,531 కి.మీగ్రావిటీ టన్నెల్ పొడవు -203 కి.మీలిఫ్టులు- 22పంప్ హౌజులు – 22ప్రాజెక్టుకు అవసరమయ్యే విద్యుత్ – 4,627 మెగావాట్లువిద్యుత్ స్టేషన్లు- 19.* ఒక్క రోజులోనే 21 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు* రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసే పంప్ హౌస్‌ల* మొత్తం బ్యారేజ్‌లు -12
* మేడిగడ్డ బ్యారేజ్ నిల్వ సామర్ధ్యం- 16,17 టీఎంసీలు
* అన్నారం బ్యారేజీ నీటి నిల్వ సామర్ధ్యం 10.87 టీఎంసీలు
* సుందిళ్ల బ్యారేజీ నీటి నిల్వ సామర్ధ్యం 8.83 టీఎంసీలు
* మేడారం జలాశయం నీటి నిల్వ సామర్ధ్యం 0.78 టీఎంసీలు
* అనంతగిరి జలాశయం నీటి నిల్వ సామర్ధ్యం 3.50 టీఎంసీలు
* రంగనాయక సాగర్ జలాశయం నీటి నిల్వ సామర్ధ్యం 3 టీఎంసీలు
* మల్లన్నసాగర్ జలాశయం నీటి నిల్వ సామర్ధ్యం 50 టీఎంసీలు
* మల్కపేట జలాశయం నీటి నిల్వ సామర్ధ్యం 3 టీఎంసీలు
* కొండ పోచమ్మ సాగర్ నీటి నిల్వ సామర్ధ్యం 15 టీఎంసీలు
* గంధమల్ల జలాశయం నీటి నిల్వ సామర్ధ్యం 9.87 టీఎంసీలు
* బస్వాపురం జలాశయం నీటి నిల్వ సామర్ధ్యం 11.39 టీఎంసీలు
* కొండెం చెరువు నీటి నిల్వ సామర్ధ్యం 3.50 టీఎంసీలు
* ప్రాజెక్టులో మొత్తం నీటి వినియోగం 237 టీఎంసీలు
* 5 నెలల పాటు రోజుకు 2 టీఎంసీల నీరు ఎత్తిపోత
* 85 గేట్లు, 1.63 కిలోమీటర్ల వెడల్పుతో మేడిగడ్డ బ్యారేజ్
* మొత్తం ప్రాజెక్‌్ీకు 8.5 కోట్ల సిమెంట్ వినియోగం
* 4.2 లక్షల మెట్రిక్ టన్నలు స్టీల్ వాడకం
* 1.17 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక వాడకం
* 53 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిపని
* ప్రాజెక్ట్ నిర్మాణంలో పనిచేసిన కార్మికులు- 60 వేల మంది
* అమెరికా, ఫిన్లాండ్ , జర్మనీ, చైనా, జపాన్ దేశాల నుంచి పంపుల దిగుమతి
* మొత్తం ప్రాజెక్ట్ వ్యయం – రూ.85 వేల కోట్లు
* కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించిన కేసీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమైంది. ముహూర్తం ప్రకారం.. శుక్రవారం ఉదయం 11.23 గంటలకు సిఎం కెసిఆర్ కాళేశ్వరం శిలాఫలకాన్ని ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సమక్షంలో తెలంగాణ సిఎం కెసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర సిఎం ఫడ్నవీస్, ఎపి సిఎం జగన్ లు విచ్చేశారు. ఉదయం 8 గంటలకు మేడిగడ్డ వద్ద కెసిఆర్ దంపతులు జల సంకల్ప హోమాన్ని నిర్వహించారు. శృంగేరి పీఠానికి చెందిన ఫణిశశాంక్ శర్మ, గోపీకృష్ణ ల ఆధ్వర్యంలో 40 మంది వేద పండితులు హోమం నిర్వహించారు. పూర్ణాహుతిలో గవర్నర్, ఎపి, మహారాష్ట్ర సిఎం లు పాల్గొన్నారు. పూర్ణాహుతి అనంతరం విచ్చేసిన అతిథులకు కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ ను కెసిఆర్ వివరించారు. అనంతరం ముహూర్తం సమయానికే ముగ్గురు ముఖ్యమంత్రులూ ప్రాజెక్టును ప్రారంభించారు
*** కాళేశ్వరం ప్రారంభానికి హరీష్ డుమ్మా
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంబోత్సవానికి మాజీ తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు దూరంగా ఉన్నారు. మహారాష్ట్ర, ఏపీ రాష్ట్రాల సీఎంలు ఫడ్నవీస్, జగన్, గవర్నర్ నరసింహన్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2014 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా, గోదావరి నది జలాలను వాడుకొనేందుకు వీలుగా సీఎం కేసీఆర్ ప్లాన్ చేశారు. కృష్ణా నదిలో ప్రవాహం తక్కువగా ఉంటున్న నేపథ్యంలో గోదావరి నదీ జలాలను వాడుకోవాలని ఆనాడు కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకొంది.ఈ మేరకు ప్రాజెక్టుల రీడిజైన్‌కు శ్రీకారం చుట్టింది తెలంగాణ సీఎం. ఇందులో భాగంగానే కేసీఆర్ ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుకు బదులుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లలోపుగా శరవేగంగా పూర్తి చేయడంలో ఆనాడు భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన తన్నీరు హరీష్ రావు కీలకంగా వ్యవహరించారు.మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం అగ్రిమెంట్ కుదుర్చుకోవడంతో పాటు….ప్రాజెక్టుకు అన్ని రకాల క్లియరెన్స్‌ను తీసుకురావడంలో హరీష్ రావు కీలకంగా వ్యవహరించారు.రాత్రిపూట కూడ కాళేశ్వరం ప్రాజెక్టు పనులు నిర్వహించారు. కాళేశ్వరంతో పాటు మహాబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తై రైతులకు సాగు నీరు అందడంలో హరీష్ రావు కీలకంగా వ్యవహరించారు.కాలేశ్వరం ప్రాజెక్టు పను గతంలో గవర్నర్ నరసింహారావు పరిశీలించారు. ఈ ప్రాజెక్టు పనులు వేగంగా జరగడాన్ని ఆయన అభినందించారు. ఆ మసయంలో మంంత్రి హరీష్ రావును గవర్నర్ అభినందించారు. హరీష్ రావును కాళేశ్వరరావు అంటూ గవర్నర్ పిలిచారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో హరీష్ రావు పాత్రను తీసీవేయకుండా ఉండేందుకు వీలుగా హరీష్ రావును కాళేశ్వరరావు అంటూ ఆయన సంబోధించారు.ప్రాజెక్టు పనులను హరీష్ రావు రాత్రి పూట ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ప్రాజెక్టుల వద్దే హరీష్ రావు పడుకొన్న ఘటనలు కూడ ఉన్నాయి. 2018 డిసెంబర్ మాసంలో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వచ్చింది.కేసీఆర్ కేబినెట్‌లో హరీష్ రావుకు చోటు దక్కలేదు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం కార్యక్రమానికి హరీష్ రావు దూరంగా ఉన్నారు. శుక్రవారం నాడు సిద్దిపేటలోనే పలు కార్యక్రమాల్లో హరీష్ రావు పాల్గొన్నారు. సిద్దిపేటలో జరిగిన యోగ దినోత్సవం పాటు జయశంకర్ వర్థంతి కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు.సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న హరీష్ రావు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఎమ్మెల్యేలకు ఆహ్వానం లేనందున హరీష్ రావు దూరంగా ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు వేగంగా పూర్తి కావడంలో కీలకంగా వ్యవహరించిన హరీష్ రావు ప్రారంభోత్సవ కార్యక్రమానికి దూరంగా ఉండడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.మంత్రి పదవి లేనందునే హరీష్ రావు ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హరీష్ రావును దూరం పెట్టారనే ప్రచారం సాగింది.అయితే ఈ ప్రచారాన్ని హరీష్ రావు తోసిపుచ్చారు. కేసీఆర్ అప్పగించిన ఏ పనైనా తాను పార్టీ కార్యకర్తగా భాద్యతతో పూర్తి చేయనున్నట్టు ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్ 11న జరిగిన ఎంపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 9 స్థానాలకే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో హరీష్ ను మెదక్ ఎంపీ స్థానానికే పరిమితం చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత హరీష్ రావు మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి సమావేశమయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముందు రోజున హరీష్ రావు ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకొన్నారు ఈ ప్రాజెక్టు త్వరగా పూర్తి కావడానికి కేసీఆర్ చేసిన కృషి ఉందని ఆయన ప్రశంసలు కురిపించారు.