*తెలంగాణ ప్రజల ఎదురుచూపులకు తెరపడింది. ఎండ తాపంతో ఉక్కిరిబిక్కిరి అయినవారికి ఉపశమనం కలిగించేలా నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. మరో రెండు మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించనున్నాయి. రుతుపవనాల ప్రభావంతో గురువారం సాయంత్రం నుంచే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.
* కేరళ ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వానికి ఓ ఆఫర్‌ను ఇచ్చింది. నీటి ఎద్దడితో బాధపడుతున్న చెన్నై వాసుల దాహార్తి తీర్చేందుకు 20 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేస్తామని పేర్కొంది. ఈ ఆఫర్‌ను తమిళనాడు ప్రభుత్వం మొదటగా తిరస్కరించింది. కాగా కేరళ ఇచ్చిన ఆఫర్‌పై సీఎం పళనిస్వామి నేడు నిర్ణయం తీసుకోనున్నట్లు ఆ రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి వేలుమణి తాజాగా తెలిపారు. తమిళనాడు కోరితే రైలు ట్యాంకర్ల ద్వారా 20 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేస్తామని కేరళ సీఎం వెల్లడించిన విషయం తెలిసిందే. కేరళ ప్రభుత్వ సాయాన్ని తిరస్కరించడం అవివేకమని డీఎంకే అధ్యక్షుడు ఎం.కే.స్టాలిన్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఏఐఏడీఎంకే ఎంపీ విజిలా సత్యనాథన్ నేడు రాజ్యసభలో మాట్లాడుతూ.. తమిళనాడు ప్రభుత్వం తీవ్ర నీటి కరువుతో బాధపడుతుందన్నారు. కావేరి నదే రాష్ర్టానికి ప్రధాన నీటి అవకావమన్నారు. కేంద్రం తక్షణం కల్పించుకుని కావేరీ నది నుంచి నీటి విడుదలకు చర్యలు చేపట్టాలని కోరారు.
* 37 మంది సీఐలను బదిలీ చేస్తూ ఏలూరు రేంజ్ డీఐజీ ఉత్తర్వులు జారీ వీఆర్ లోకి 11 మందివీఆర్ లో ఉన్న నలుగురికి పోస్టింగ్కృష్ణాజిల్లాలో స్పెషల్ బ్రాంచ్ సీఐగా పని చేస్తున్న కిషోర్ బాబు తూర్పు గోదావరి జిల్లా తుని సీఐగా బదిలీ.
* చైనాలో ఉత్సాహంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ”స్నేహం, సహకారం”తో కలిసి పని చేసే స్ఫూర్తిని యోగా కలుగజేస్తుందని చైనాలో భారత రాయబారి విక్రమ్ మిశ్రీ అన్నారు. బీజింగ్‌లో మిశ్రీ ఆధ్వర్యంలో జరిగిన యోగా కార్యక్రమంలో అనేకమంది చైనీయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చైనాలో శరీర పటుత్వాన్ని సంరక్షించే ప్రక్రియగా యోగా బహుళ ప్రజాదరణ పొందుతోంది.
* పాత ఫోన్ పక్కన పెట్టేసి కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి శుభవార్త. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ప్లిప్‌కార్ట్‌లో మొబైల్ బొనాంజా సేల్ రూపంలో స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు అందిస్తోంది. భారీ డిస్కౌంట్‌తో పాటు బ్యాంక్ డిస్కౌంట్, ఎక్సేంజ్ ఆఫర్ సదుపాయం కూడా ఉంది. రూ.19,999లు ఉన్న హానర్ 9ఐఈ ఆఫర్ జూన్ 21 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లయితే అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్‌తో ఈ ఫోన్‌ను రూ.8,999కే పొందవచ్చు. ఫీచర్ల విషయానికి వస్తే.. 4 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ, 5.9 అంగుళాల స్క్రీన్, డ్యూయెల్ కెమెరా (16 ఎంపీ+2 ఎంపీ),డ్యూయెల్ ఫ్రంట్ కెమెరా (13 ఎంపీ+2ఎంపీ), 3340 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలెన్నో ఉన్నాయి. మరికెందుకు ఆలస్యం.
* ఇండియాలో రాజకీయ నాయకులు పార్టీలను మారుతున్న సమస్యలకు కొన్ని పార్టీల వైఖరే కారణమని కాంగ్రెస్ పార్టీ మహిళా నేత విజయశాంతి వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ లో ఆమె ఓ పోస్ట్ పెట్టారు. ‘ప్రస్తుతం దేశంలోని పార్టీ మార్పు సమస్య మొత్తం ఆ పార్టీల కొన్ని నిర్ణయాల తప్పిదం. సిద్ధాంత విధానాల కోసం ఉన్న కార్యకర్తల బదులుగ, వ్యాపార నిర్బంధాలు ఉన్న పెద్దలకు కీలక పదవులు నియామకంలో స్థానం కల్పించడం వల్ల ఇది ఉత్పన్నమవుతూ వచ్చింది.
* తూర్పు గోదావరి ములగపూడి గ్రామంలో మైనింగ్ తవ్వకాలపై శుక్రవారం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రౌతులపూడి మండలం ములగపూడి గ్రామంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మల్లికార్జున రావు, ఆర్‌డిఒ వసంతరాయుడు, మైనింగ్ అధికారులు కలిసి సర్వే నంబర్ 1 లో మైనింగ్ తవ్వకాలపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు.
* వర్షాకాలం వచ్చినా మండే ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న రాష్ట్ర ప్రజలకు శుభవార్త. రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్నాయి. రాయలసీమ, కోస్తాంధ్ర వైపు వేగంగా రుతుపవనాలు కదులుతున్నాయి.రుతుపవనాల రాకతో ఈరోజు ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.రుతుపవనాల రాక కారణంగా రాగల నాలుగు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. రుతుపవనాల రాకతో వాతావరణం చల్లగా మారనుంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గే సూచనలు ఉన్నాయి.
*ప్రతి ఒక్కరూ తమ స్మార్ట్ఫోన్లకు లాక్ వేస్తుంటారు. ఇది సర్వసాధారణం. అయితే తాజా అధ్యయనం ఒకటి… స్మార్ట్ ఫోన్కు వేసే లాక్ విధానంతో వారి వయసు అంచనా వేయొచ్చని తేల్చింది. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు.ఈ అధ్యయనం ప్రకారం స్మార్ట్ఫోన్ వాడే వయోవృద్ధులు ఎక్కువ శాతం ఆటోమేటిక్ లాక్ వైపే మొగ్గు చూపుతున్నారట. అలానే ఫింగర్ప్రింట్ లాక్లనూ వినియోగిస్తారని నివేదికలో పేర్కొంది. ఎప్పుడైనా ఖాళీ సమయాల్లో, ఇంట్లో ఉండేటప్పుడే మాత్రమే వారు చరవాణులను అన్లాక్ చేస్తారట. అలానే యువత కంటే వీరి ఫోన్ వినియోగ సమయం చాలా తక్కువని పరిశోధకులు తెలిపారు.
* కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ లో ప్రపంచ యోగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ట్రిపుల్ ఐటీ అధికారులు ,విద్యార్థులు రకరకాల ఆసనాలు వేసి యోగ యొక్క విశిష్టత గుర్చి వివరించారు
* నైరుతి రుతుపవనాలు మరో రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించనున్నాయి. ఇప్పటికే ఆలస్యం కావడంతో రాష్ట్రంలో హెచ్చు ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. కొన్ని జిల్లాలో వడగాడ్పులు కూడా ఉంటాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.
*ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగంలో ఉత్తీర్ణులైన ఇంటర్ ఎంపీసీ విద్యార్థులు బీటెక్, బీఫార్మసీ, ఫార్మా-డి కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 24వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. మొదటి విడత ప్రక్రియ జులై 12వ తేదీతో ముగియనుంది.
*రవాణాకు సంబంధించిన పలు చిక్కుముళ్లు ఇకముందు వీడనున్నాయి. సరకు రవాణా వాహనాలకు పన్ను భారం తగ్గనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మధ్య పరస్పర అవగాహన ఒప్పందం(కౌంటర్ సిగ్నేచర్ అగ్రిమెంట్) చేసుకునేందుకు మార్గం సుగమమవుతోంది.
*ప్రస్తుత సచివాలయంలోని సమతాబ్లాక్ ముందు నూతన సచివాలయానికి శంకుస్థాపన నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పునర్నిర్మాణంలో సచివాలయాన్ని మరింత విస్తరించనుంది. ప్రస్తుతం ఉన్న స్థలాలతోపాటు సచివాలయం పక్కన, వెనుక మింట్కంపౌడ్లోని పలు స్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది.
*ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన తెలంగాణ పీజీ ఈసెట్లో 88.27 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 19 సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహించగా 15,644 మంది కౌన్సెలింగ్కు అర్హత సాధించారు.
*తెలంగాణలో వైద్యవిద్య ప్రవేశ ప్రక్రియలో జాప్యం చోటుచేసుకుంటోంది. ఆర్థికంగా బలహీన వర్గాల(ఈడబ్ల్యూఎస్) కోటాపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఇప్పటి వరకూ రాకపోవడంతో ప్రవేశ ప్రకటన వెల్లడించనట్లుగా తెలుస్తోంది.
*కాంగ్రెస్ అధ్యక్షుడిగా తన స్థానంలో మరో నేతను నియమించే బాధ్యత పార్టీదేనని, ఆ విషయంలో తన జోక్యం ఉండబోదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ నియామకానికి తాను ఆమోదం తెలిపానంటూ వచ్చిన వార్తలను గురువారం ఆయన తోసిపుచ్చారు.
*మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని అటవీ ప్రాంతంలో ఉన్న కొడిసెలగట్టు, కోమట్లగూడెం గ్రామాల ప్రజలను ఇప్పటికిప్పుడు ఖాళీ చేయించరాదని అధికారులను ఆదేశిస్తూ గురువారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
* కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభంతో రాష్ట్రంలో కొత్త శకం ప్రారంభమవుతుందని, తెలంగాణ ముఖచిత్రం సమూలంగా మారుతుందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్శాఖల మంత్రి నిరంజన్రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
*హిమాచల్ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయిన జస్టిస్ వి.రామసుబ్రమణియన్కు గురువారం హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్ నేతృత్వంలో మొదటి కోర్టు హాలులో న్యాయమూర్తులు, న్యాయవాదులు సమావేశమై వీడ్కోలు పలికారు.
*వచ్చే నెల 11న దక్షిణ కొరియాలోని బుసాన్ నగరంలో జరిగే తొమ్మిదో ప్రపంచ యువజన మంత్రుల సమ్మేళనంలో భారతదేశం తరుఫున పాల్గ్గొనాల్సిందిగా అంతర్జాతీయ యువజన స్నేహసంస్థ (ఫెలోషిప్) ప్రతినిధులు తెలంగాణ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ను ఆహ్వానించారు.
*ప్రజాస్వామికవాదుల అక్రమ నిర్బంధాలకు వ్యతిరేకంగా ఈ నెల 23వ తేదీ ఆదివారం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు పౌరహక్కుల సంఘం(సీఎల్సీ) ఒక ప్రకటనలో తెలిపింది.
*తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చొరవతో సౌదీ అరేబియాలో విముక్తి పొందిన కార్మికుల్లో మరో 12 మంది గురువారం స్వదేశానికి చేరుకున్నారు. మొత్తం 56 మందికిగాను గత వారం 39 మంది హైదరాబాద్కు చేరిన విషయం తెలిసిందే.
*తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగంలో ఉత్తీర్ణులైన ఇంటర్ ఎంపీసీ విద్యార్థులు బీటెక్, బీఫార్మసీ, ఫార్మా-డి కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 24వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. మొదటి విడత ప్రక్రియ జులై 12వ తేదీతో ముగియనుంది.
*జిల్లా కలెక్టర్ల సదస్సు ఈనెల 24న సచివాలయంలోని అయిదో బ్లాక్లో జరగనుంది. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టి నాలుగు వారాలు కావస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ విధానాల్ని స్వయంగా వివరించి, వాటిని ఎలా అమలుచేయాలన్న దానిపై కలెక్టర్లకు దిశా నిర్దేశం చేయనున్నారు.
*తెదేపా రాజ్యసభ సభ్యులు నలుగురు భాజపాలోకి రావడాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్వాగతించారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా భాజపా రాష్ట్రంలో బలమైన శక్తిగా అవతరిస్తోందని ఆయన గురువారం ట్వీట్ చేశారు.
రుతుపవనాలు ఆగమనం-తాజావార్తలు–06/21
Related tags :